Kajal Aggarwal's First Pregnancy: 15 ఏళ్ళ కెరీర్ లో కాజల్ ఎంత సంపాధించిందో తెలుసా?
టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత 15 ఏళ్లకు పైగా సౌత్ సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఒక వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సినిమాల సంఖ్య తగ్గినప్పటికీ రోజురోజుకీ ఆమె అభిమానుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కాజల్ సినిమాలలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు భర్త తెలియజేయడంతో ఒక్కసారిగా ఆ విషయం వార్తల్లో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం కాజల్ కు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సినిమాలు.. ఫ్యామిలీ లైఫ్
కాజల్ అగర్వాల్ దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతేకాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా దాదాపు అందరి అగ్ర హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నట్లు టాక్ అయితే వస్తుంది. ఇక కాజల్ అగర్వాల్ మరొకవైపు ఫ్యామిలీ లైఫ్ ను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

కాజల్ ప్రెగ్నెంట్
కాజల్ అగర్వాల్ గత ఏడాది తన ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరు మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. గౌతమ్ కిచ్లు నూతన సంవత్సర సందర్భంగా కాజల్ ఫొటోను పోస్ట్ చేశాడు, "ఇదిగో 2022 మీ కోసం చూస్తున్నాను" అని క్యాప్షన్ ఇవ్వడమే కాకుండా గర్భిణీ గా ఉన్న ఎమోజిని కూడా జత చేశాడు.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
కాజల్ అగర్వాల్, గౌతమ్ 2020 అక్టోబర్‌లో ముంబైలో వివాహం చేసుకున్నారు. ఇక కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునెందుకు ఇటీవల ఈ జంట దుబాయ్ హార్బర్ ప్రాంతంకు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా వారు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

కాజల్ ఆస్తి విలువ..
ఇక కాజల్ ఆస్తుల వివరాల్లోకి వెళితే.. ముంబైలో నివసిస్తున్న కాజల్ అగర్వాల్ 2016లో దాదాపు రూ. 5 కోట్ల విలువైన ఇంటిని నిర్మించుకుంది. 2016లో ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీల కాజల్ చోటు దక్కించుకుంది. ఇక 2021లో ఆమె నికర విలువ దాదాపు 86 కోట్లు అని కథనాలు వెలువడ్డాయి. కాజల్ ఆ మధ్య కాలంలో కాజల్ ఒక్కో సినిమాకి 3కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్ వచ్చింది.

సెలబ్రేటీగా భారీ ఆదాయం..
సోషల్ మీడియా అలాగే టీవీ యాడ్స్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కాజల్ అగర్వాల్ ఒక్కో బ్రాండ్ యాడ్స్‌కు రూ. 1 నుండి 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని టాక్. కాజల్ ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీలతో డీల్ సెట్ చేసుకొని బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతూ వచ్చారు. అలాగే పలు బిజినెస్ లలో పెట్టుబడుల ద్వారా కూడా కాజల్ తన ఆదాయాన్ని పెంచుకున్నట్లు సమాచారం.
Recommended Video

ఖరీదైన లగ్జరీ కార్లు
ఇక కాజల్ దగ్గర ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఆమె ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన వాటిలో ఆడి A4 ఒకటి. దాని విలువ 42.35 లక్షలు. ఇక 88.24లక్షల విలువ చేసే రేంజ్ రోవర్ స్పోర్ట్ కారు కూడా ఉంది. ఆ మధ్య స్కోడా ఆక్టావియా (26.80 లక్షలు) కారును కూడా కాజల్ కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications











