‘యష్ యమా హాట్ గురూ.. నాకు పెళ్లి కాకపోతే అతడే నా బాయ్‌ఫ్రెండ్’
కరోనా తర్వాత సినీ ప్రేక్షకుల అభిరుచి మారిపోవడం.. ఇతర భాషల సినిమాలపై ఆసక్తి పెరగడంతో పాన్ ఇండియా సినిమాల నిర్మాణం ఊపందుకొన్నది. అలాగే ఓటీటీల హవా కూడా పెరిగిపోవడంతో చాలా మంది నటులు తమ లాంగ్వేజ్‌లో కాకుండా ఇతర ఇతర భాషల్లో నటిస్తూ.. దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకొంటున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ దక్షిణాది సినిమాలో ప్రముఖ హీరోతో జత కట్టేందుకు సిద్దమైనట్టు ఓ వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ కపూర్ ఫ్యామిలీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని గ్లామర్ హీరోయిన్‌గా, నటిగా కరీనా కపూర్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు హిందీలోనే స్టార్ హీరోలందరితోను నటించి మెప్పించారు. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. దాదాపు రెండు దశాబద్దాల నట జీవితం తర్వాత తొలిసారి కరీనా దక్షిణాదిలో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారు.

ఇక కరీనా కపూర్ దాంపత్య జీవితం విషయానికి వస్తే.. పలువురు కుర్ర హీరోలతో డేటింగ్, అఫైర్ నడిపించిన ఆమె.. చివరకు పటౌడీ వంశానికి చెందిన సైఫ్ ఆలీ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకొన్నారు. అప్పటి నుంచి పిల్ల పాపలు, సినీ జీవితంతో కాలాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కేజీఎఫ్ హీరో యష్‌తో సినిమా చేసేందుకు అంగీకరించినట్టు ఓ వార్త వెలుగులోకి వచ్చింది.
ఇటీవల కరీనాకపూర్ మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది సినీ పరిశ్రమలో హాటెస్ట్ యాక్టర్ అంటే యష్ మాత్రమే. నాకు ఒకవేళ పెళ్లి కాకపోతే యష్ నా బాయ్‌ఫ్రెండ్ యష్ అయి ఉండే వాడు. ఆయన అంటే నాకు అంత క్రష్ అని చెప్పింది. దాంతో దక్షిణాదిలో చేసే సినిమా హీరో యష్ అని పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.

అలాగే నేను దక్షిణాదిలో అతిపెద్ద ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని ఆమె చెప్పారు. కేజీఎఫ్1, 2 తర్వాత యష్ ప్రస్తుతం టాక్సిక్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కరీనా కపూర్ నటిస్తున్నారనే ఊహాగానాలు మరింత బలం చేకూరింది. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభమవుతుందని తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











