twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Katrina Kaif Wedding ఏడు గుర్రాల రథంలో పెళ్లి కొడుకు.. 14వ శత్దాబ్దం నాటి కోటలో ప్రత్యేకంగా మండపం

    |

    బాలీవుడ్ తారలు వికీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజస్థాన్‌లో రాయల్‌గా జరిగే స్టార్ సెలబ్రిటీ వివాహానికి సర్వం సిద్దమయ్యాయి. ప్రైవేట్ కార్యక్రమంగా జరిగే ఈ పెళ్లికి అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులను ఆహ్వానించినట్టు తెలిసింది. అయితే అనేక ఆంక్షల మధ్య కత్రినా, వికీ కౌశల్ ఒక్కటవ్వబోతున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం...

    14వ శతాబ్దం నాటి కోటలో

    14వ శతాబ్దం నాటి కోటలో

    కత్రినా కైఫ్, వికీ కౌశల్ పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని 14వ శతాబ్దం నాటి కోటలో అంగరంగవైభవంగా జరుగబోతున్నాయి. రాజస్థాన్‌లోని మధోపూర్‌లోని రాయల్ పెళ్లి వేదిక వద్ద ఏర్పాట్లు పూర్తయ్యా. 14వ శతాబ్దం నాటి సిక్స్ సెన్సెస్ బార్వారా కోట కత్రినా పెళ్లికి ముస్తాబువుతున్నది. ఈ కోటను రాజస్థాన్‌కు చెందిన రాజవంశీకులు కట్టించారు. రాంథంబోర్ నేషనల్ పార్క్‌కు ఈ వేదిక 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పెళ్లి కోసం కత్రినా వ్యక్తిగత సిబ్బంది ఇప్పటికే మధోపూర్‌కు చేరుకొన్నారు.

    ఏడు గుర్రాల బగ్గీలో బరాత్

    ఏడు గుర్రాల బగ్గీలో బరాత్

    కత్రినా కైఫ్‌తో పెళ్లి సందర్భంగా పెళ్లి కొడుకు వికీ కౌశల్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అందంగా అలకరించిన ఏడు గుర్రాల రథంలో ఊరేగుతూ పెళ్లి వేదిక వద్దకు చేరుకొంటున్నారు. రాజవంశంలో జరిగే పెళ్లికి ఏ మాత్రం తగ్గకుండా కత్రినా, వికీ పెళ్లి జరుగబోతున్నదని సన్నిహితులు,స్నేహితులు వెల్లడిస్తున్నారు. వికీ కౌశల్ ఊరేగింపుగా వచ్చే రథం కోసం ఇప్పటికే నిర్వాహకులు ఏడు తెల్లటి గుర్రాలను సిద్ధం చేశారు.

    గ్లాస్‌తో కట్టిన వివాహ మండపం

    గ్లాస్‌తో కట్టిన వివాహ మండపం

    కత్రినా కైఫ్, వికీ కౌశల్ పెళ్లి కోసం వేదికను అద్భుతంగా కోవిడ్‌ ప్రోటోకాల్స్ అనుగుణంగా ఏర్పాటు చేశారు. పెళ్లి వేదిక చుట్టు గ్లాస్‌తో మండపాన్ని నిర్మించారు. వధూవరులు, పూజారులు మాత్రమే గ్లాసుతో తయారు చేసిన మండపంలో ఉంటారు. కోవిడ్ కారణంగా ఈ ఏర్పాట్లు చేశారు అంటూ నిర్వాహకులు వెల్లడించారు.

    డిసెంబర్ 7 నుంచి 10 వరకు

    డిసెంబర్ 7 నుంచి 10 వరకు

    అయితే కత్రినా కైఫ్, వికీ కౌశల్ పెళ్లి వేడుకలు ఇలా జరుగున్నాయి. డిసెంబర్ 7వ తేదీన సంగీత్ ఫంక్షన్‌ను నిర్వహిస్తారు. డిసెంబర్ 8వ తేదీన మెహందీ కార్యక్రమం ఉంటుంది. డిసెంబర్ 9వ తేదీన పెళ్లి వేడుక ఘనంగా జరుగుతుంది. డిసెంబర్ 10వ తేదీన రిసెప్షన్ జరుగుతుంది అని సన్నిహితులు తెలిపారు.

    అధికారికంగా భార్యభర్తలైన కత్రినా, వికీ..

    అధికారికంగా భార్యభర్తలైన కత్రినా, వికీ..

    అయితే ముంబైలో ఇప్పటికే కత్రినా కైఫ్, వికీ కౌశల్ అధికారికంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొన్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం వీరిద్దరు అధికారికంగా మ్యారేజ్ డాక్యుమెంట్లపై సంతకాలు చేశారు. తమ పెళ్లిని కోర్టు ద్వారా అధికారిక గుర్తింపు పొందేందుకు చర్యలు తీసుకొంటున్నారు అని మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

    Recommended Video

    Athadu Ame Priyudu Movie Launch| Nagababu | Yandamuri Veerendranath | Kaushal | Filmibeat Telugu
    వికీ కౌశల్, కత్రినా కైఫ్ కెరీర్ విషయానికి వస్తే

    వికీ కౌశల్, కత్రినా కైఫ్ కెరీర్ విషయానికి వస్తే


    వికీ కౌశల్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన నటించిన రాజీ, లస్ట్ స్టోరీస్, సంజూ, యూరీ: ది సర్జికల్ స్ట్రైక్స్ లాంటి చిత్రాలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం సర్దార్ ఉద్దమ్ సింగ్, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కత్రినా కైఫ్ నటించిన సూర్యవంశీ చిత్రం ఇటీవలే రిలీజై భారీ విజయాన్ని అందుకొన్నది.

    English summary
    Heroine Katrina Kaif and Hero Vicky Kaushal Wedding at 14th Century's Six Senses Fort Barwara of Rajasthan. As per Reports, Sangeet on December 7th, Mehandi on December 8th, Marriage on December 9th, Reception will be on December 10th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X