షర్ట్ లేకుండా ఆ హీరోతో ఆటోలో అడ్డంగా దొరికిన కీర్తి సురేష్... వీడియో వైరల్
మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసినా ఈ బ్యూటీ.. త్వరలో బాలీవుడ్ ఎంట్రీ సైతం ఇస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఓ బాలీవుడ్ హీరోతో ఆటోలో అడ్డంగా బుక్కైందంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో ఎవరు ఉన్నారు.. ఏం జరిగిందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సొంతం చేసుకున్న బ్యూటీ కీర్తి సురేష్. ఈమె తల్లిదండ్రులు సైతం సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే కావడంతో.. బాల నటిగానే ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక తమిళంలో ఎన్నో సినిమాలు చేసినా ఈ బ్యూటీ.. తెలుగులో రామ్ తో కలిసి నేను శైలజ సినిమాతో అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ.

ఇక తెలుగులో వరుస అవకాశాలు, ఆఫర్లు క్యూ కట్టాయి. కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ... మంచి క్రేజ్ అయితే కొట్టేసింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళం చిత్రాల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ కొట్టేసిన ఈ భామ.. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా .. దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మూవీ తర్వాత చాలా సినిమాల్లో నటించిన ఈ భామకు అంతగా కలిసిరావడం లేదు.
చివరగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా సైతం డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు తన అదృష్టం బాలీవుడ్ లో పరీక్షించుకోనుంది. వరుణ్ ధావన్ తో కలిసి ఈ బ్యూటీ బాలీవుడ్ మూవీలో నటిస్తుంది. అయితే ఆ విషయం పక్కన పెడితే.. వరుణ్ ధావన్ తో కలిసి కీర్తి సురేష్ ఆటోలో రైడ్ కి వెళ్లింది. అందులో వరుణ్ ధావన్ షర్ట్ వేసుకోకుండా.. బనియన్ మీద ఉన్నారు.

ఇక ఈ వీడియోను తీసి నెట్టింట్లో పెట్టగా వైరల్ గా మారింది. కీర్తి సురేష్ స్టార్ హీరోతో ఆటోలో అడ్డంగా దొరికిపోయిందంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వీడియోలో వరుణ్ షర్ట్ లేకుండా ఉంటే.. కీర్తి సురేష్ మాత్రం నవ్వుతూ సిగ్గుపడుతు ఉంది. ఈ ఫోటోస్ వీడియోస్ నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారాయి. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందనే ప్రశ్నలు సైతం తలెత్తింది.
అయితే మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇలా చేశారా... లేదా.. క్యాజువల్ గానే రైడ్ కు వెళ్లాారా అనేది తెలియదు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట ఓ ఊపు ఊపేస్తోంది. ఇక కీర్తి సురేష్ మొదటి బాలీవుడ్ చిత్రం వరుణ్ తో చేస్తుంది. ఇక ఈ సినిమా అయినా ఈ భామకు సక్సెస్ను ఇస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











