కీర్తి సురేష్ కిల్లింగ్ గ్లామర్ షో: కవ్వించే ఫోజులు అంటే ఇవే బాసూ!
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి అమ్మాయి సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. అలాంటిది కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుని స్టార్‌గా ఎదుగుతున్నారు. అలాంటి వారిలో మహానటి కీర్తి సురేష్ ఒకరు. అసాధారణ ప్రతిభతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. సౌతిండియా మొత్తంలోనూ హవాను చూపిస్తూ వరుస సినిమాలతో సందడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ కీర్తి సురేష్ తెగ సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని బోల్డు ఫొటోలు వదిలింది. అవి మీకోసమే!
చైల్ట్ ఆర్టిస్టు.. హీరోయిన్‌గా:కీర్తి సురేష్ చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 'గీతాంజలి' అనే మలయాళ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం తమిళంలోనూ కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటరైంది. ఇది సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు ఆఫర్లు వచ్చాయి.

నేషనల్ అవార్డుతో క్రేజ్:'నేను శైలజ' తర్వాత కీర్తి సురేష్ తెలుగులో వరుసగా సినిమాలు చేసి సత్తా చాటింది. అలాగే, బడా స్టార్లతో భారీ సినిమాలను కూడా చేసింది. ఈ క్రమంలోనే అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో కీర్తి లీడ్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా లభించింది.
దసరాతో పాటు మరొకటి:మొదట్లో కీర్తి సురేష్ వేరే భాషల్లోనే సినిమాలు చేసినా.. స్టార్‌గా మారిన తర్వాత మాత్రం తెలుగు చిత్రాలకే ప్రయారిటీ ఇస్తోంది. ఈ ఉత్సాహంతోనే గత ఏడాది వరుసగా 'గుడ్ లక్ సఖి', 'సర్కారు వారి పాట', 'వాషీ', 'సానీ కాయిదామ్' అనే సినిమాలు చేసింది. ఇక, ఈ ఏడాది నాని 'దసరా', ఉదయనిధి స్టాలిన్‌తో 'నాయకుడు' మూవీలు చేసి సక్సెస్‌లు కొట్టింది.

భోళా ఫ్లాప్.. ఆ మూవీలే:దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ హవాను చూపిస్తోన్న కీర్తి సురేష్.. ఇటీవలే 'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా నటించింది. ఇది డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక, ఇప్పుడు ఈ బ్యూటీ 'సిరేన్', 'రఘు తాతా', 'రివాల్వర్ రీటా', 'కన్నివేడి' అనే తమిళ సినిమాల్లోనూ నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సైతం కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అందులో యమ బిజీగా:సౌతిండియాలోని అన్ని భాషల్లోనూ వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్న కీర్తి సురేష్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. దీంతో ఆమె రేంజ్ కూడా పెరుగుతోంది.

అందాలను ప్రదర్శిస్తూ:స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హల్చల్ చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె ఓవర్‌గా గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేసుకుంటోంది. దీంతో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవుతూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

కీర్తి బోల్డు పిక్స్ వైరల్‌గా:మహానటి కీర్తి సురేష్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చీరను ధరించి స్ట్రాప్ అండ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో దర్శనమిచ్చింది. పైగా ఈ ఫొటోల్లో ఈ హీరోయిన్ విచిత్రమైన ఫోజులతో అందాలను ఆరబోసింది. ఫలితంగా ఈ పిక్స్‌లో కీర్తి పరువాలు కవ్విస్తున్నాయి. దీంతో వీటికి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











