Keerthy Suresh: ఆయన ప్రేమలేఖ ఇప్పటికీ గుండెల్లోనే... సీక్రెట్ లవర్ గురించి బయపెట్టిన కీర్తి సురేశ్!
కీర్తి సురేశ్ ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ వైపు కమర్షియల్ చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆడియెన్స్‌ను కట్టి పడేస్తోంది. తనే ఈ తరం మహానటి కీర్తి సురేశ్. అయితే ఈ ముద్దుగుమ్మకు వయసు 30 దాటింది. కానీ ఇంకా పెళ్లి పీటలెక్కలేదు. తాజాగా ఈమెకు సంబంధించి ఓ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే ఆమె సీక్రెట్ లవర్ గురించి. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది! ఇది తెలుసుకుంటున్న అభిమానులు షాక్ అవుతున్నారు. దాని గురించే ఈ కథనం..
ఏంటి.. కీర్తి సురేశ్‌కు నిజంగానే సీక్రెట్ లవర్ ఉన్నారా? మరి ఇన్ని రోజులు బాయ్ ఫ్రెండే లేరు అంటూ చెప్పుకొచ్చింది కదా అని అనుకుంటున్నారా? అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే వచ్చింది కదా. ఆ రోజు చాలా మంది సెలబ్రిటీలు తమ లవర్స్‌కు, కాబోయే పార్ట్నర్స్కు విషెస్ చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే కీర్తి సురేశ్ రిలేషన్షిప్ గురించి కూడా వార్త ఒకటి బయటకు వచ్చింది. దాని గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.

వాస్తవానికి కీర్తి సురేశ్‌కు పెళ్లీడు రావడంతో చాలా సార్లు రకరకాల పెళ్లి పుకార్లు తెరపైకి వచ్చాయి. ఆమె తన క్లాస్ మేట్‌ను పెళ్లి చేసుకోబోతుందని, సంగీత దర్శకుడు అనిరూధ్ను వివాహ మాడనుంది, ఇంకా దుబాయ్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని పెళ్లి చేసుకోనుందని ఇలా రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ వీటిని ఆమె ఎప్పటికప్పుడు సున్నితంగానే కొట్టి పారేసింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాత్రం తనకు సంబంధించిన ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
దానికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ఆమె తన సీక్రెట్ లవర్‌ను తలుచుకొని కాస్త ఎమోషనల్ అయింది. తనకు ఇప్పటికే చాలా లవ్ లెటర్స్ వచ్చాయని కానీ ఇప్పటికీ అందులో ఓ వ్యక్తి రాసిన ప్రేమ ఉత్తరాన్ని తన దగ్గరే భద్రంగా దాచుకున్నట్లు తెలిపింది. అదీ ఎప్పటికీ ఎంతో స్పెషల్ అని చెప్పింది.

"కెరీర్ ప్రారంభ సమయంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లాను. అక్కడ చాలా మంది నన్ను చూడటానికి వచ్చారు. వారిలో ఓ అబ్బాయి నా దగ్గరికు వచ్చి ఒక పుస్తకాన్ని నా చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అందులో నాకు సంబంధించిన ఫొటోలతో పాటు ఓ ప్రేమలేఖ కూడా రాసి ఉంది. ఇంకా తన పేరు,అడ్రెస్, ఫోన్ నెంబర్ అన్ని రాసి ఉన్నాయి. తనను పెళ్లి చేసుకోవాలిని అనిపిస్తే కాల్ చేయమని రాసి ఉంచాడు. మొదట అది చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత నవ్వుకున్నాను. అదీ నాకు వచ్చిన తొలి ప్రేమ లేఖ కావడం వల్ల ఇప్పటికీ దాన్ని నా దగ్గర ఉంచుకున్నాను" అంటూ చెప్పింది కీర్తి సురేశ్. ఇప్పుడా వీడియోనే మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు కీర్తికి ఆ లెటర్ ఇచ్చిన మహానుభావుడు ఎవరని కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











