Keerthy Suresh: అందం కోసం కీర్తి సురేష్ అలా చేస్తుందా? అమ్మాయిలూ మీరు ఫాలో అవ్వండి!
హీరోయినుగా ఎంట్రీ ఇవ్వాలంటే... ముఖ్యంగా ఉండాల్సింది అందం, అభినయంతో పాటు నటన. ఇవి ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకువస్తారు. ఎంత బాగా యాక్టింగ్ చేసినప్పటికీ.. హీరోయిన్స్ కు ఉండాల్సిన మొదటి లక్షణం అందమనే చెప్పాలి. అయితే ఈ అందాన్ని కాపాడుకోవాడానికి హీరోయిన్లు ఎన్నో పాట్లు పడుతూ ఉంటారు. అందులో కీర్తి సురేశ్ కూడా ఉన్నారట. ఆమె తన అందం వెనుక ఉన్న సీక్రెటును బయట పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే...
బాలనటిగా ఎంట్రీ ఇచ్చి : మలయాళ బ్యూటీ కీర్తి సురేష్.. బాలనటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈమె తండ్రి సురేశ్ సినీ నిర్మాత. 2000 సంవత్సరంలో బాలనటిగా ఫైలట్స్ అనే చిత్రంలో కనిపించింది. బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. ఈ భామ ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత 2013లో మలయాళం సినిమా గీతాంజలితో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాతో ఆమెకు తమిళ, తెలుగు భాషల్లో వరుస అవకాశాలు వచ్చాయి.

ఫస్ట్ సినిమాతోనే హిట్టు : ఇక తెలుగులోకి రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. రావడం రావడంతోనే బంపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కీర్తికి వరుస అవకాశాలు వచ్చాయి. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక మహానటి తర్వాత కీర్తికి అంత కలిసి రాలేదనే చెప్పాలి. ఇక మహానటి తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీస్తే.. ఒక్కటి కలిసి రాలేదు. ఇక గ్లామర్ ను నమ్ముకుని మహేశ్ తో సర్కారు వారి పాట సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా బంపర్ హిట్టుగా నిలిచింది.

బ్యూటీ సిక్రెట్ ఇదే : ఇక మహేశ్ సినిమాతో ఫాంలోకి వచ్చిన కీర్తి సురేష్... మళ్లీ వరుస అవకాశాలు దక్కించుకునే పనిలో పడింది. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ... తన అందం వెనుక ఉన్న రహాస్యం ఏంటో బయటపెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ.. తన అందం గురించి సీక్రెట్ చెప్పింది. అందరిలా తన ఫేసుకు ఏవేవో ప్రొడక్ట్స్ వాడను అంటూ అసలు విషయం బయపెట్టింది ఈ భామ.

ఇలా వారానికి రెండు సార్లు : నారింజ తొక్కతొ ఫేస్ మాస్కు వేసుకుంటుందట. దానితో పాటు వారానికి రెండు సార్లు పసుపు మొహానికి రాసుకుంటుందట. ఇంకా పెరుగు కూడా రాస్తే గ్లో వస్తుందని చెబుతోంది ఈ భామ. అంతేకాదు కెమికల్స్ ప్రాడెక్ట్స్ అస్సలు వాడదని చెప్పుకొస్తుంది. గులాబీ, బాదంపప్పు, ఓట్సు వంటివి వాడుతూ ఉంటుందని చెబుతోంది. ఇక కీర్తి సురేష్ బ్యూటీ సీక్రెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం కీర్తి సురేశ్.. చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో చిరుకు సిస్టర్ గా నటిస్తోంది. ఇక ఇదే కాకుండా మూడు తమిళ సినిమాలు తన చేతిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











