రూట్ మార్చిన కేతిక శర్మ.. యాక్టింగ్ పక్కన పెట్టి మరో ఫీల్డ్ పై ఫోకస్
ప్రెజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోయిన్స్ కోకొల్లలు అని చెప్పాలి. కాగా ఈ యంగ్ హీరోయిన్స్ లో మన తెలుగు హీరోయిన్స్ కూడా ఉన్నారు అలాగే ఇతర భాషలు నుంచి కూడా వచ్చిన వారు ఉన్నారు. అయితే టాలెంట్ ఉండి కొంచెం అందంగా, స్కిన్ షో చేసే హీరోయిన్స్ కి మంచి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి కానీ కొందరు విషయంలో మాత్రం ఇది అంతగా వర్కౌట్ కాదు. అన్నీ ఉంటాయి కానీ పెద్దగా అవకాశాలు అయితే కనిపించవు.
మరి ఇలాంటి పరిస్థితులు దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి పరిచయం అయ్యిన హీరోయిన్స్ కి చాలా తక్కువే కనిపిస్తాయి. మరి అలాంటి ఓ యంగ్ హీరోయిన్ నే కేతిక శర్మ. దర్శకుడు పూరి జగన్నాథ్ తో మొదటి సినిమా 'రొమాంటిక్' తోనే తాను అదరగొట్టేసింది. పూరి కొడుకు ఆకాష్ పూరి సరసన పర్ఫెక్ట్ ఏజ్ తో తెరకెక్కించిన ఈ సినిమా పెద్దగా రాణించలేదు కానీ కేతిక మాత్రం అందరి దృష్టి ఆకర్షించింది.

అక్కడ నుంచి ఈ యంగ్ బ్యూటీ మెగా హీరోస్ వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లతో "రంగ రంగ వైభవంగా" పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో చేసిన "బ్రో" లలో ఆమె నటించే ఛాన్స్ లు కొట్టేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ పెద్దగా ఏ సినిమాల్లో కూడా నటిస్తున్నట్టుగా కనిపించడం లేదు. కాగా సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ షో తో యూత్ కి మంచి కిక్ ఇవ్వడం మాత్రం ఆపలేదు.
అలా సోషల్ మీడియాలో అసలు తాను ఏ సినిమాలు అయినా చేస్తుందా అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చింది ఈ అమ్మడు. కాగా ఇప్పుడు ఈమె రెండు సినిమాలు పూర్తి చేసినట్టుగా తెలిపింది. ఇంతే కాకుండా ఇంకో ఆసక్తికర విషయాన్ని కూడా కేతిక శర్మ రివీల్ చేసింది. ఆ సినిమాలు కాకుండా తనకి తాను సొంతంగా ఒక స్క్రిప్ట్ ని కూడా రాసుకుంటున్నట్టుగా తెలిపింది. ఇది మాత్రం ఒక ఊహించని అంశం అని చెప్పాలి.

మహా అయితే 25 కూడా ఉండని ఓ యంగ్ హీరోయిన్ నటిగా మాత్రమే కాకుండా ఒక స్క్రిప్ట్ రైటర్ కూడా చేస్తుండడం ఒక ఆశ్చర్యకర విషయమే అని చెప్పాలి. అసలు సినిమా రంగంలో నటన కాకుండా మరో క్రాఫ్ట్ లో లేడీస్ కనిపించడమే చాలా అరుదు, జెనరల్ గా నటన, స్క్రిప్ట్, పాటలు డైలాగ్స్ లాంటివి హీరోస్ చేస్తూ ఉంటారు.
కానీ ఇక్కడ కేతిక కూడా ఈ కోవలోకే వెళ్లడం ఒకింత ఇంట్రెస్టింగ్ గానే ఉందని చెప్పొచ్చు. మరి కేతిక సొంతంగా ప్రిపేర్ చేస్తున్న ఆ స్క్రిప్ట్ ఏంటో అనేది వేచి చూడాలి. కాగా ఈ యంగ్ బ్యూటీ సినిమాలు అన్నీ పూరి కాంపౌండ్, నటి ఛార్మి సారథ్యంలోనే నుంచే ఓకే అవుతాయి అని ఓ టాక్ ఉంది. మరి వారి నుంచే తన సినిమా కూడా రానుందా ఏమో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











