అన్నీ చేస్తా.. తక్కువే తీసుకుంటా! హాట్ టాపిక్‌గా మారిన సెక్సీ హీరోయిన్ తీరు

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. సరిగ్గా ఇదే ఫాలో అవుతోంది యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ. ఏ మాత్రం అవకాశం దొరికినా అందాలు ఆరబోసేందుకు రెడీగా ఉండే కియారా ప్రస్తుత హీరోయిన్లలో హాట్ అండ్ క్యూట్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. రెమ్మ్యూనరేషన్ కాస్త అటూ ఇటూ అయినా ఫర్వాలేదు కానీ బాలీవుడ్, టాలీవుడ్ తెరలపై తన హంగామానే ఉండాలని భావిస్తున్నట్లుగా కియారా తీరు చూస్తుంటే తెలిసిపోతోంది. ఇటీవలే తెలుగు తెరపై భరత్ అనే నేను సినిమా హిట్ కావడం, బాలీవుడ్‌లో కియారాకు మంచి గుర్తింపు ఉండటంతో ఉత్తరాది, దక్షిణాది హీరోయిన్లలోకెల్లా కియారాకు ప్రత్యేక స్థానం ఏర్పడింది.

ఓ హీరోయిన్ బాలీవుడ్‌లో పాగా వేయడమంటే అంత తేలికైన వ్యవహారం కాదు. అక్కడి సీనియర్‌ హీరోయిన్లను దాటుకొని వారి చూపును తనవైపు తిప్పుకోవడమంటే ఆ హీరోయిన్ సక్సెస్ అయినట్లే లెక్క. ఇందులో కియారా అద్వానీ అందరికంటే ముందు వరుసలోనే ఉంది. బాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకోవాలంటే ముందు రెమ్యునరేషన్‌ విషయంలో కాస్త వెనుకగానే ఉండాలని, అందాలు రెచ్చిపోయి ప్రదర్శించాలన్న సంగతి ఆదిలోనే గ్రహించిన కియారా స్కిన్‌షో, గ్లామర్‌ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని బాహాటంగానే చెబుతోంది.

Heroine Kiara Advani josh in Bollywood cinema

దీంతో ఇప్పుడు దక్షిణాదివారికే కాకుండా ఉత్తరాదివారికి కూడా కియారా అద్వానీ కావలసిన హీరోయిన్‌ అయిపోయింది. దీంతో కియారాలో బతకనేర్చిన తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయనీ అందుకే వరుస అవకాశాలతో దూసుకుపోతోందనీ బాలీవుడ్‌ జనాల్లో టాక్ నడుస్తోంది. ఇక ఇటీవలే కియారా అద్వానీ మరో అడల్ట్ మూవీకి కమిటైన సంగతి తెలిసిందే. ఇప్పటికే లస్ట్ స్టోరీస్ అనే అడల్ట్ వెబ్ సిరీస్‌లో రెచ్చిపోయి నటించిన ఈ భామ ఈ సారి డిఫరెంట్ అడల్ట్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు కబీర్ సింగ్, లక్ష్మి బాంబ్ సినిమాల్లో నటిస్తోంది కియారా. చూడాలి మరి మున్ముందు కియారా కెరీర్ ఎలా టర్న్ తీసుకుంటుందో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X