టాక్సిక్‌లో ఆ బోల్డ్ సీన్లను తొలగించండి.. మితిమీరిన శృంగారంపై కియారా అద్వానీ ఆందోళన
కేజీఫ్ తర్వాత కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్ అప్స్ . ఈ సినిమా విషయానికి వస్తే.. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. దక్షిణాదిలోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యుమా ఖురేషి లాంటి టాప్ హీరోయిన్లు నటిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్, టొవినో థామస్, అమిత్ తివారీ కీలక పాత్రల్లో నటించనున్నారు.
ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత రాజీవ్ రవి సినిమాటోగ్రఫర్‌గా, రవి బస్రూర్ మ్యూజిక్, ఉజ్వల్ కులకరణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు టీపీ అబిద్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి జాన్ విక్ సినిమాకు పనిచేసిన జేజే పెర్రీ యాక్షన్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాను మార్చి 19, 2026లో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ చిత్రం వరుస వాయిదాలతో అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది.
ఈ సినిమా రిలీజ్ వాయిదాలు ఓ పక్కన చర్చనీయాంశం అయ్యాయి. అయితే ఈ సినిమా ప్రోమో కంటెంట్‌లోని సన్నివేశాల్లో మితి మీరిన శృంగారం ఉందనే విషయంపై వివాదాస్పదమైంది. అలాంటి వివాదాస్పదమైన ఈ సినిమాలోని బోల్డ్ సన్నివేశాలను తొలగించాలని టాప్ హీరోయిన్ కియారా అద్వానీ రిక్వెస్ట్ చేశారనే వార్త జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కియారా చేసిన రిక్వెస్ట్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఇటీవల హీరో యష్‌ను, అలాగే దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌ను కియారా అద్వానీ సంప్రదించారు. ఈ చిత్రం కోసం తనపై చిత్రీకరించిన బోల్డ్ సీన్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అభ్యర్థించారు. యష్, తన మధ్య ఉండే శృంగార సన్నివేశాల నిడివిని తగ్గించడమో లేదా? వాటిని తొలగించడమో చేయాలని తన సూచించినట్టు తెలిసింది.
ఈ సినిమాకు మార్పులు చేర్పులు చేపట్టడం, అలాగే వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ విషయంలో ఆడియెన్స్‌కు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించే విషయంలో మెరుగైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కియారా అద్వానీ రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకొంటారా? ఆమెపై షూట్ చేసిన సీన్లను తొలగించే ప్రయత్నం చేస్తారా? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
టాక్సిక్ సినిమాను వెంకట్ కే నారాయణ భారీగా నిర్మించారు. ఐదుగురు టాప్ హీరోయిన్లతో క్రేజీగా ఈ సినిమాను నిర్మించారు. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యష్ టీమ్ ప్రయత్నిస్తున్నది.


Click it and Unblock the Notifications