‘ఆ వార్త అవాస్తవం.. అసత్యం.. తప్పుదోవపట్టించేలా రూమర్లు’

సినిమా పరిశ్రమలో హీరోయిన్ల మీద రూమర్లు, గాసిప్ప్ రావడం సహజమే. అయితే కొన్ని అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేయడం వల్ల వారి కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాంటి వార్తలను ప్రచారం చేసే వారిపై కొందరు ఘాటుగా స్పందిస్తే.. మరికొందరు రిక్వెస్ట్ చేసి తమ గురించి తప్పుగా రాయకండి అంటూ ప్రాధేయపడుతారు. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న యువ హీరోయిన్ తనపై వస్తున్న రూమర్లపై ఆవేదన వ్యక్తం చేసింది. తనపై వస్తున్న వస్తున్న వార్తలను ఖండించింది. ఆ యువ హీరోయిన్‌పై వచ్చిన వార్తలు ఏమిటీ? ఆమె ఎలాంటి క్లారిటీ ఇచ్చిందంటే?

టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న టాలెంటెడ్ అండ్ యంగ్ హీరోయిన్ కోమలి ప్రసాద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నేను సీతాదేవీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత నెపోలియన్, అనుకొన్నది ఒక్కటి.. అయింది ఒక్కటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ పీసీ 524, హిట్ 2, హిట్ 3 చిత్రాల్లో నటించడమే కాకుండా తన ప్రతిభతో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకొన్నారు.

Heroine Komali Prasad

అయితే ప్రస్తుతం తన ప్రతిభతో మంచి గుర్తింపు పొందుతున్న ఆమె గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం మొదలైంది. ఇటీవల ఆమె డాక్టర్ పట్టా పుచ్చుకోవడంతో.. ఇక ఆమె యాక్టింగ్‌కు దూరం కానున్నారు. ఆమె వైద్య వృత్తిలో స్థిరపడేందుకు ప్లాన్ చేసుకొంటున్నారని కోమలి ప్రసాద్‌పై సోషల్ మీడియాలోను వెబ్ మీడియాలోను వార్తలు, పోస్టులు పెట్టారు. దాంతో తన ప్రమేయం లేకుండా తన గురించి వస్తున్న వార్తలను చూసి ఆందోళన చెందారు. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టి ఆ వార్తలను ఖండించారు.

ఇన్స్‌టాగ్రామ్‌లో కోమలి ప్రసాద్ స్పందిస్తూ... నేను డాక్టర్ అయ్యానని, నటనకు దూరం అయ్యానంటూ అసత్య ప్రచారం, తప్పదోవ పట్టించే వార్తల్ని ప్రచురిస్తున్నారు. ఎలాంటి వాస్తవాలు తెలుసుకోకుండా ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ వార్తను హైలెట్ చేస్తూ ప్రచారం చేస్తుండటం బాధను కలిగించింది. అందుకే ఈ వార్తలో నిజం లేదని చెప్పాలనుకొంటున్నాను. ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. ఎన్సో సమస్యలు ఎదుర్కొని మీ అందరి ఆదరణతో ఈ స్థాయికి వచ్చాను. శివుడి దీవెనలతో నా కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నాను అని తెలిపారు.

నా కెరీర్ గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసి నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ వార్తల పట్ల నేను కూడా ఆవేదనకు గురి అయ్యాను. ఇలాంటి వార్తలకు చెక్ పెట్టే విధంగా నా నుంచి స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని అనుకొన్నాను. నా చివరి శ్వాస వరకు నటిగానే కొనసాగుతాను. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచే పాత్రల్లో నటిస్తాను. చాలా కథలు వింటున్నాను. పలు స్క్రిప్టులను పరిశీలిస్తున్నాను. త్వరలోనే మీరు ఎక్సైట్ అయ్యే వార్తలతో మీ ముందుకు వస్తాను. మీరు గర్వపడేలా చేస్తాను అని కోమలి ప్రసాద్ వెల్లడించారు.

కోమలి ప్రసాద్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో మంచి పాత్రతో ముందుకు వచ్చారు. తాను హీరోయిన్‌గా నటించిన శశివదనే సినిమా త్వరలోనే రిలీజ్ కానున్నది. ఇంకా పలు సినిమాల వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: komali prasad sasivadane hit 3
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X