Krithi Shettyతో బికినీ వేయించాలని హీరో ప్రయత్నం.. భారీగా రెమ్యునరేషన్ ఆఫర్..?
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన క్యూట్ హీరోయిన్ కృతి శెట్టి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. అయితే ఈ బ్యూటీ ఇంకా రెండు పదుల వయసులో కి రాకముందే ఊహించని స్థాయిలో పారితోషికం అయితే అందుకుంటుంది. అయితే అమ్మడికి బికినీ ఆఫర్స్ కూడా చాలానే వస్తున్నాయి.
కానీ ఇప్పుడే అలాంటి రిస్కులు చేయడానికి ధైర్యం చేయడం లేదు అని తెలుస్తోంది. అంతేకాకుండా కృతి శెట్టితో బికినీ వేయించాలి అని ఒక హీరో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాత కూడా భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. ఆ వివరాల్లోకి వెళితే..

అతి తక్కువ కాలంలోనే: పదేళ్ల వయసులోనే కమర్షియల్ యాడ్స్ లో కనిపించిన కృతి శెట్టి ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా కూడా మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ లో పెంచుకుంది. అతి తక్కువ కాలంలోనే అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ను పెంచుకోవడంతో ఆమెపై ఫోకస్ గట్టిగానే పడింది. దీంతో మొదట్లోనే మంచి ఆఫర్లు వచ్చాయి. సినిమా సక్సెస్ కావడంతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఊహించని స్థాయిలో: ఇక మొదటి సినిమా సక్సెస్ అయ్యిందో లేదో రెండవ సినిమా బంగార్రాజుకు ఆమె ఊహించని స్థాయిలో మరింత ఎక్కువగా రెమ్యునరేషన్ అందుకుంది. మొదటి సినిమాకు లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకున్న ఆమె రెండవ సినిమా నుంచి కోటికి పైగానే డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో నిర్మాతలు కూడా ఆమె క్రేజ్ ను బట్టి అడిగినంత ఇస్తూ వస్తున్నారు.

వరుసగా ఫ్లాప్స్: ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు ఇలా వరుసగా మూడు విభిన్నమైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లిక్ కావడంతో ఆ తర్వాత అమ్మడికి మరిన్ని ఆఫర్లు వచ్చాయి. అయితే మధ్యలో కొన్ని దారుణమైన డిజాస్టర్స్ కూడా ఎదురయ్యాయి. రామ్ పోతినేని ది వారియర్ సినిమాతో పాటు నితిన్ మాచర్ల నియోజకవర్గం ఇలా రెండు సినిమాలు కూడా ఫెయిల్ కావడంతో మళ్లీ అమ్మడి హవా ఒక్కసారిగా తగ్గిపోయింది.
కమర్షియల్ సినిమాలో..: అయితే కృతి శెట్టి ఇప్పుడు మళ్లీ ట్రాక్ లోకి రావాలని ఆలోచిస్తోంది. ఈ బ్యూటీకి తమిళంలో కూడా ఇప్పుడు ఆఫర్లు పెరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇటీవల ఒక బడా హీరో అలాగే బిగ్ ప్రొడ్యూసర్ కాంబినేషన్లో ఒక స్టైలిష్ యాక్షన్ కమర్షియల్ సినిమాలో ఈ బ్యూటీకి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు గానే కృతి శెట్టిని అందులో ఒక గ్లామరస్ పాత్రకు సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారట.

బికినీ కోసం బిగ్ రెమ్యునరేషన్: అయితే హీరో సలహా ప్రకారం మంచి గ్లామర్ డోస్ ఉండే విధంగా కనిపించాలి అని కృతి శెట్టి అయితే బాగుంటుంది అని ఆలోచించారట. అంతేకాకుండా అందులో బికినీ సన్నివేశాలు కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కృతి శెట్టి మాత్రం ఇంకా గ్లామర్ డోస్ పెంచడంలో బర్డర్ దాటలేదు.
ఇక ఆమెను భారీగా రెమ్యునరేషన్ ఇవ్వాలి అని కూడా నిర్మాత డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు కోట్ల వరకు తీసుకుంటున్న కృతిశెట్టి బికినీ ఆఫర్ కు ఒప్పుకుంటే 4 కోట్ల వరకు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











