Bhagavanth Kesari: భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
బాలయ్య భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈ సినిమాలో బాలయ్య యాక్టింగ్, డైలాగులు హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో బాలయ్యకు కూతురి పాత్రలో శ్రీలీల నటించిన విషయం తెలిసిందే. విజ్జిపాప పాత్రలో శ్రీలీల యాక్టింగ్ ఇరగదీసిందని అంటున్నారు. అయితే ఈ పాత్రను ఓ హీరోయిన్ మిస్ చేసుకుందట. అయితే ఇప్పుడు ఆ హీరోయిన్ మిస్ చేసుకుని తప్పు చేసిందని అంటున్నారు నెటిజన్స్. ఆ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భగవంత్ కేసరి సినిమా థియేటర్లోకి వచ్చేసింది. బాలయ్య మాస్ అండ్ యాక్షన్ తో అదరగొట్టేశాడు. ఇక అనిల్ రావిపూడి కామెడీ మార్కింగ్ తో పాటు.. యాక్షన్ ఎలివేట్స్, సెంటిమెంట్ అన్ని కలగలిపి ఈ చిత్రంలో ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో కాజల్ ఆగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక బాలయ్యకు కూతురి పాత్రలో శ్రీలీల నటించింది. విజ్జి పాప రోల్ లో శ్రీలీల జీవించేసిందని అంటున్నారు. అంతలా ఈ క్యారెక్టర్ తనకు సూట్ అయిందంట.

భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అంతే కాదు థియేటర్ల వద్ద జై బాలయ్య నినాదం మారుమ్రోగుతోంది. ఇక బాలయ్య మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాలో బాలయ్య తొలిసారిగా తెలంగాణ యాసలో మాట్లాడారు. ఇక ఆయన చెప్పిన డైలాగ్స్ కు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. తమన్ మ్యూజిక్ అఖండ రేంజులో లేదని అంటున్నారు.

ఇక విజ్జి పాప రోల్ లో శ్రీలీల ఇరగదీసిందని అంటున్నారు. అయితే మరి ఇలాంటి పాత్రను ఓ హీరోయిన్ మిస్ చేసుకుందట. ఆమె ఎవరో కాదు... ఉప్పెన బ్యూటీ బేబమ్మ కృతి శెట్టి. శ్రీలీల పాత్ర కోసం మొదట కృతి శెట్టిని అప్రోచ్ అయ్యారట అనిల్ రావిపూడి . అయితే కూతురు పాత్ర అంటూ సాగదీసి చేయను అంటూ హ్యాండ్ ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత శ్రీలీలను ఈ పాత్రకు చూస్ చేసుకున్నారట మేకర్స్.

ఇక కృతిశెట్టి ఆ పాత్రను మిస్ చేసుకుని పెద్ద తప్పు చేసిందని నెటిజన్స్ అంటున్నారు. చేసి ఉంటే కెరియర్ పరంగా పెద్ద హిట్ పడేదని అంటున్నారు. అసలే ఈ బ్యూటీ కష్టకాలంలో ఉంది.. సరైనా హిట్లు లేకా సతమతమవుతుంది ఈ భామ. మరి అలాంటి క్రమంలో ఈ పాత్రను మిస్ చేసుకోవడం దురదృష్టమే అంటున్నారు. ఇక ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక శ్రీలీల ఈ పాత్రను ఓకే చేసి.. మంచి పని చేసిందని అంటున్నారు. ఇక ఈ పాత్రలో శ్రీలీల జీవించేసిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక శ్రీలీల ఖాతాలో మరో హిట్ పడింది. ఇప్పటికే వరుస సినిమాలతో ఈ భామ దూసుకుపోతుంది. స్టార్ హీరోల సరసన ఈ భామ నటిస్తుంది. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు కుర్ర హీరోల సినిమాల్లో నటిస్తుంది. ఇక ఈ భామ సినిమాలు.. నెలకు ఒక్కటైనా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.


Click it and Unblock the Notifications











