Krithi Shetty: లైవ్ ఇంటర్వ్యూలో ఏడ్చేసిన ఉప్పెన బ్యూటీ.. వాళ్ళ మోసానికి కన్నీళ్ళు ఆగలేదు..

ఉప్పెన సినిమాతో తెలుగువారికి బాగా దగ్గరైనా కృతి శెట్టి ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా మారిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం లో కూడా ఈ బ్యూటీకి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. చాలా సున్నితంగా కనిపించే బేబమ్మ విభిన్నమైన పాత్రలను కూడా సెలెక్ట్ చేసుకుంటోంది. అయితే ఒక ఇంటర్వ్యూ లో ఇద్దరు అబ్బాయిలు చేసిన పనికి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మొదటి సినిమాతోనే..

మొదటి సినిమాతోనే..

సినిమాల్లోకి రాకముందు చిన్నప్పటినుంచే కమర్షియల్ యాడ్స్ లో కనిపించిన కృతి శెట్టి ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా మంచి గుర్తింపు అందుకుంది. ఇక మోడలింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టక ముందు ఆమెకు సినిమా పరిశ్రమలో మంచి అవకాశాలు వచ్చాయి. ఉప్పెన సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కనిపించిన కృతి శెట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదల కాకముందే ఈ బ్యూటీకి చాలా మంచి అవకాశాలు వచ్చాయి.

భారీగా రెమ్యునరేషన్

భారీగా రెమ్యునరేషన్

ఇక ఉప్పెన సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా సక్సెస్ అవ్వడం కృతి శెట్టి కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. అలాగే పారితోషికం విషయంలో కూడా అమ్మడి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బంగార్రాజు సినిమా లో నాగచైతన్య కు జోడిగా నటించిన కృతి శెట్టి ఆ సినిమా కోసం దాదాపు కోటిన్నరకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.

 తమిళంలో కూడా..

తమిళంలో కూడా..


ఏది ఏమైనా కూడా కృతి శెట్టి కెరీర్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే ఊహించని రేంజ్ కు వెళ్ళి పోయింది. ఇక ఈ బ్యూటీ డేట్స్ దొరకాలంటే కూడా ప్రస్తుతం నిర్మాతలకు కష్టంగానే మారిపోయింది. ఎందుకంటే కేవలం తెలుగులోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో కూడా బిజీగా మారుతోంది. ప్రస్తుతం రామ్ పోతినేని ది వారియర్ సినిమాతో పాటు తమిళంలో సూర్య బాల కలయికలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో కూడా నటిస్తోంది.

ఏడ్చేసిన కృతి శెట్టి

ఏడ్చేసిన కృతి శెట్టి

అయితే ప్రస్తుతం కృతి శెట్టి కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అందులో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి కలిగిస్తోంది. మొదట చాలా సింపుల్ గా కనిపించిన కృతి శెట్టి ఒక్క సారిగా చిన్న పాపలా కన్నీళ్లు పెట్టుకుంది. అలా కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే నెటిజన్లు కూడా కరిగి పోయినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది.

 మాటల యుద్ధం

మాటల యుద్ధం

అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే ఇటీవల ఒక తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన కృతి శెట్టి.. యాంకర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. అయితే మధ్యలో ఇరువురి యాంకర్స్ మధ్యలో కొంత మాటల యుద్ధం జరిగింది. ఇక వారు కెమెరా ఆఫ్ చేసి కొట్టుకునే వరకు వెళ్లినట్లు అనిపించింది. ఆ ఘటనను చూసిన కృతి ఒక్క సారిగా ఆశ్చర్యపోయింది.

Recommended Video

Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
కన్నీళ్లు ఆగలేదు

కన్నీళ్లు ఆగలేదు

అయితే యాంకర్స్ ఇద్దరు అలా కొట్టుకోగానే మళ్లీ కృతి ఎక్కడ భయపడి పోతుందో అని వాళ్ళిద్దరూ కూడా ఇది ప్రాంక్ అని తెలియజేశారు. అయినప్పటికీ కూడా కృతి శెట్టి మొదట నవ్వుతూనే ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంది. తన కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉండడం తో అందరూ షాక్ అయ్యారు. తన టీం సభ్యులు కూడా వచ్చి ఆమెను ఓదార్చి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చివరికి ప్రాంక్ అద్బుతమని ఆశ్చర్య పోయినట్లుగా కూడా ఆమె వాళ్ళకు స్పోర్టివ్ గా తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X