Krithi Shetty Birthday: ఆ హీరోతో బేబమ్మ రొమాన్స్... ఆ స్పెషల్ వీడియో మీరు చూశారా?

హీరోయిన్ కృతిశెట్టి... తెలుగు ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక రావడం రావడమే 100కోట్ల సినిమా తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు అందుకుంది. ఆ తర్వాత ఎందుకు ఈ భామకు అంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు, మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఈ భామ బర్త్ డే సందర్భంగా శర్వానంద్ మూవీ టీం స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది కృతి శెట్టి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 100కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ఈ భామ శ్యాం సింగరాయ్ సినిమా చేసింది. ఇందులో నానితో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ... ఆ తర్వాత నాగ చైతన్యతో బంగార్రాజు సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ఈ భామకు కలిసి వచ్చాయి.

 Krithi Shetty Birthday:

ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న కృతి.. ఆ తర్వాత చేసిన ఏ సినిమా కలిసి రాలేదు. చివరగా తనకు హిట్టు ఇచ్చిన నాగ చైతన్యతో కలిసి కస్టడి సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ భామ.. తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో కూడా సినిమాలు చేస్తుంది.

 Krithi Shetty -Sharwanand

టాలీవుడ్ లో శర్వానంద్ 35వ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తుంది. నేడు కృతి పుట్టినరోజు కావడంతో మూవీ టీం ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఈ మూవీ షూటింగ్ సెట్స్ నుంచి కృతికి సంబంధించిన విజువల్స్ ని రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలియచేసింది చిత్రబృందం. ఇక ఈ వీడియోలో కృతిశెట్టి లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక శర్వానంద్ హీరోగా యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది. మధ్యలో శర్వానంద్ పెళ్లి జరగడంతో కాస్త బ్రేక్ తీసుకున్నారు మూవీ మేకర్స్. ఆ తర్వత ఈ మూవీ లండన్ లో షూటింగ్ ని జరుపుకుంది.

ఇక కృతిశెట్టికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూనే.. టైటిల్ అనౌన్స్‌మెంట్, టీజర్ గురించి వెల్లడించారు. త్వరలోనే వీటికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తామంటూ తెలిపారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీగా నిర్మిస్తున్నది. మలయాళ సంగీతం దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మొన్ననే ఖుషి సినిమాకు సంగీతం అందించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్... తెలుగులో హాయ్ నాన్న, ఇప్పుడు శర్వా35 సినిమాలకు అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X