Venu Swamy వేణుస్వామి అలాంటోడు... అతని బండారాన్ని బయటపెట్టిన హీరోయిన్!
సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెబుతూ బాగా ఫేమస్ అయిపోయాడు. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకుల విషయం చెప్పడం ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఇక ఆ తర్వాత స్టార్ హీరోల జ్యోతిష్యం, హీరోయిన్లతో పూజలు ఇవన్నీ ఆయనకు బాగానే పాపులారిటినీ తెచ్చిపెట్టాయి. అయితే తాజాగా ఓ హీరోయిన్ వేణు స్వామి నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఆయన అలాంటోడు అంటూ చెప్పుకువచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగానే పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు సినిమా షూటింగులకు ముహుర్తాలు పెడుతూ.. అలా సినీ ఇండస్ట్రీపై ఇంట్రెస్టుతో వారి జాతకాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఒకటి రెండు సినిమాల్లో కూడా వేణు స్వామి నటించాడు. మహేష్ బాబు అతడు సినిమాలో పూజారిగా కనిపించగా.. జగపతి బాబు సినిమాలోనూ పూజారిగా కనిపించాడు. ఇక తర్వాత సినిమా వాళ్ల జాతకాలు చెబుతూ మరింత పాపులర్ అయ్యాడు.

ముఖ్యంగా నాగచైతన్, సమంత పెళ్లి తర్వాత ఈ జంట ఎక్కువ కాలం కలిసి ఉండదు అంటూ చెప్పుకువచ్చాడు. ఆ తర్వాత నిజంగానే సమంత, నాగచైతన్య విడిపోయారు. దీంతో నేను చెప్పింది జరిగిందంటూ మళ్లీ వీడియోలు చేసి పెట్టాడు. అలా లైమ్ లైట్ లోకి వచ్చిన వేణుస్వామి.. ఆ తర్వాత పలు సెలబ్రిటీల జాతకం చెప్తూ ఫేమస్ అయ్యాడు. ఇక ప్రభాస్ విషయంలో, అల్లు అర్జున్ విషయంలో కాస్త నిజం కావడంతో ఆయన మాటలు చాలా మంది నమ్మారు.
ఎంతో మంది ఆయన దగ్గర పూజలు చేయించుకున్నారు. హీరోయిన్ రష్మిక నుంచి మొన్నటి వైన్ బాటిల్ పూజ డింపుల్ హయతీ వరకు చాలా మంది ఈయన్నీ నమ్ముతారు. మొన్నటికి మొన్న హీరోయిన్ డింపుల్ హాయతి వైన్ బాటిల్ పెట్టి మరీ పూజలు చేశారు. ఆ తర్వాత తెల్లారి కొత్త బైక్ కొన్నట్లు తన ఇన్ స్టాలో వేణు స్వామి వీడియో పోస్ట్ చేశాడు. ఈ లెక్కన వేణు స్వామి బాగానే సంపాదిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే వేణు స్వామిపై బజ్జీల పాప అలియాస్ హీరోయిన్ కుషిత కల్లపు సంచలన కామెంట్స్ చేసింది. కుషిత కల్లపు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యూట్యూబర్ గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఇటీవల బాబు నంబర్ 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో హీరోగా బిగ్ బాస్ ఫేం అర్జున్ కళ్యాణ్ నటించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వేణు స్వామిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

''వేణు స్వామి చెప్పేవి అన్ని అబద్ధాలే చెప్తారు... ఆయన దగ్గరకు ఒక ఇష్యూ అయ్యాక వెళ్లాను. కానీ ఆయన కామెంట్స్ మాత్రం... నేను సంవత్సరం ముందే చెప్పాను.. నీ దిశ మారుతుందని అంటూ అబద్దాలు మాట్లాడాడు. నేను ఒక ఇష్యూ అయిన తర్వాతే ఆయన్నీ కలిసాను కదా ముందు కలవలేదు. ఇష్యూ తర్వాత కలిసి నేను చెప్పడం వల్లే ఫేమస్ అయ్యింది అనడం చాలా తప్పు అంటూ ఆయన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. దీంతో ఆయన పరువు తీసిందిగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కుషిత వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











