"నా మొదటి ముద్దు అతడికే.. లిప్ లాక్ సీన్లు అస్సలే చేయను"
మోడల్ గా కెరియర్ ప్రారంభించిన కుషిత కల్లపు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భతమైన అందంతో అంతకు మించిన షో చేసే ఈ ముద్దుగుమ్మ నటిగా కూడా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బాబు అనే ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా.. ఈ సందర్భంగానే కుషిత మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా అతడికే తన తొలి ముద్దు అని చెప్పేసింది. అలాగే లిప్ లాక్ సీన్లు అస్సలే చేయను అని వివరించింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కుషిత కల్లపు.. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ తో కలిసి బాబు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవలే జరిగింది. ఈ సందర్భంగానే హీరోహీరోయిన్లు ఇద్దరూ మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా కుషిత తన కెరియర్ గురించి చాలానే విషయాలు వెల్లడించింది. తాను గుంటూరు కారం సినిమాలో నటించానని.. కానీ తన సీన్లు అన్నీ సినిమాలోంచి తొలగించారని, ఎందుకు తీసేశారో కూడా తనకు తెలియదని చెప్పింది. ఆ విషయం తెలిసి చాలా బాధ పడ్డానని కూడా వెల్లడించింది.

కానీ సినిమాలు అంటే ఇలాగే ఉంటుందని... మంచి సీన్ల కోసమే వీటిని తొలగించి ఉండొచ్చని కూడా వివరించింది కుషిత. అలాగే ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు చాలా బోల్డ్ గా సమాధానం చెప్పింది. మీరు బోల్డ్ సీన్లలో ముఖ్యంగా లిప్ లాక్ వంటి సీన్లలో నటిస్తారా అని అడగ్గా.. లేదని చెప్పేసింది. నేను అలాంటి సీన్లు అస్సలే చేయనని తెలిపింది. ఇటీవలే యానిమల్ సినిమాలో త్రిప్తి దిమ్రి బోల్డ్ సీన్స్ చేయగా విపరీతమైన గుర్తింపు వచ్చింది అలాంటి పాత్రలు వచ్చినా చేయరా అని యాంకర్ అడిగాడు.

అందుకు కుషిత తాను అసలు అలాంటి సీన్లే చేయనని.. చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తాను కొన్ని తన భర్తకు మాత్రమే ఇవ్వాలి అనుకుంటున్నట్లు.. ముఖ్యంగా లిప్ లాక్ కానీ, ముద్దు కానీ, ఏదైనా కానీ తన భర్తకు మాత్రమే ఇవ్వాలని ఫిక్స్ అయినట్లు స్పష్టం చేసింది. కాబట్టి అన్నీ తనకు కాబోయే భర్త కోసమే దాచుతున్నట్లు వివరించింది. చూడాలి మరి ముందుముందు ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. అలాగే ఇప్పుడు హీరోయిన్ గా చేస్తున్న బాబు సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందనేది.


Click it and Unblock the Notifications











