ఆడపడుచుకు కట్నం ఇవ్వలేదట.. అందుకే నిహారిక కోసం ఆ పని చేస్తుందట.. లావణ్య కామెంట్లు వైరల్!
మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది నవంబర్ ఒకటో తేదీన తన ప్రియుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. కొణిదెల కుటుంబానికి రెండో కోడలిగా మారిపోయింది. అయితే పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ తొలిసారి ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగానే కొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తన ఆడపడుచు నిహారికి కొణిదెల గురించి చాలా విషయాలు తెలిపంది. తనకు ఆడపడుచు కట్నం ఇవ్వనందుకు ఆమె కోసం కచ్చితంగా ఆ పని చేస్తానని వివరించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లు ఐదేళ్ల పాటు సీక్రెట్ గా ప్రేమాయణం సాగించారు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇరుకుటుంబాల పెద్దలకు చెప్పి ఒప్పించారు. ఇటలీ వేధికగా చాలా గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇలా మెగా ఫ్యామిలీలో రెండో కోడలిగా అడుగు పెట్టిన ఈ అందాల రాక్షసి ఓవైపు ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తోంది. ముఖ్యంగా మిస్ పర్ ఫెక్ట్ అనే ఓ వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కాబోతుంది.

అయితే ఈ వెబ్ సిరీస్ గురించి వరుసగా ఈ ముద్దుగుమ్మ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ ఇంటర్వ్యూల్లో కేవలం వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రశ్నలే కాకుండా ఆమె పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురు అవుతున్నాయి. ఆమె కూడా ఎలాంటి కోపం లేకుండా మెళ్లిగా సమాధానాలు చెబుతోంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. తన ఆడ పడుచు, మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రశ్నలు ఎదురు అయ్యాయి. ముఖ్యంగా మీరు మీ ఆడ పడుచుకు ఏమైనా కట్నం ఇచ్చారా అని అడగ్గా.. లావణ్య త్రిపాఠి లేదు అని చెప్పింది.
మరి మీరు కట్నం ఇవ్వలేదు కదా.. ఆమె కోసం ఆమె ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏమైనా సినిమాలు చేస్తారా అని అడగ్గా.. ఓ తప్పకుండా చేస్తాను.. నా ఆడ పడుచు నిహారికి కోసమే కాకుండా నా ఫ్యామిలీ కోసం ఏమైనా చేసేందుకు నేను సిద్ధం అని చెప్పుకొచ్చారు. తన ఆడ పడుచు నిహారిక అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపింది. తనకు నిహా మంచి స్నేహితురాలు అని పెళ్లికి ముందే నుంచి తామిద్దరం చాలా క్లోజ్ అని వివరించింది.

పెళ్లికి తర్వాత, పెళ్లికి ముందు ఎలాంటి తేడా లేదని.. అప్పుడు ఎలా ఉన్నామో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నామని చెప్పుకొచ్చింది. కాకపోతే ఇప్పుడు ఒకే చోట కలిసి ఉన్నామని వివరించింది. చాలా హ్యాపీగా ఉన్నామని.. తన భర్త సినిమాతో పాటు తన వెబ్ సిరీస్ సక్సెస్ అయితే ఇంకా బాగుంటుందని వివరించింది.


Click it and Unblock the Notifications











