స్కిన్ షో చేయడమేనా? ఇంకా ఏమైనా చేస్తావా? నెటిజన్‌ తింగరి ప్రశ్నకు దిమ్మతిరిగేలా ప్రభాస్ హీరోయిన్ జవాబు

పాపులర్ సినిమాటోగ్రాఫర్ మోహనన్ వారసురాలిగా మాళవిక మోహనన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ధనుష్, విజయ్ లాంటి స్టార్స్ సరసన నటించి తమిళంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. స్టార్ హీరోయిన్ మాళవిక మోహనన్ తనను పిచ్చి ప్రశ్నలు అడిగిన నెటిజన్ కు మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం ఇచ్చింది. మరి ఇంతకీ వీళ్లిద్దరి మధ్య జరిగిన ఆ చిట్ చాట్ ఏంటి అనే విషయంపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే ఆమె ఫస్ట్ తెలుగు మూవీ కావడం విశేషం. అలాగే తమిళంలో తంగలాన్ అనే పాన్ ఇండియా సినిమాలో నటనకు ప్రాధాన్యత ఉన్న మంచి పాత్రను పోషిస్తుంది. అందులో విక్రమ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Heroine Malavika Mohanan befitting reply to netizen over her Skin Show in Social media

ఇక సినిమాల సంగతి అలా ఉంచితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా మంచి పాపులారిటీని మెయింటైన్ చేస్తోంది. అభిమానుల కోసం తరచుగా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ మధ్య ఆమె ఫ్యాన్స్ కు పంచుతున్న గ్లామర్ డోస్ కాస్త ఎక్కువైందనే చెప్పాలి.

అయితే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు దగ్గరవుదాం అని చూసే హీరోయిన్లకు కొన్నిసార్లు ఊహించని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ ప్రశ్నలకు స్పందించిన విధానాన్ని బట్టే హీరోయిన్ల హుందతనాన్ని లెక్కేస్తుంటారు వాళ్ళ అభిమానులు. తాజాగా మాళవిక మోహనన్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది.

తాజాగా ట్విట్టర్లో ఆమె అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇక వెంటనే నెటిజెన్లు ఆమెను ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. ఓ అభిమాని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ప్రశ్నించగా నా పెళ్లి గురించి నువ్వు ఎందుకు తొందర పడుతున్నావు ? అంటూ తిరిగి ప్రశ్నించింది మాళవిక.

అలాగే ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఎవరు? అంటే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ గురించి చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత చాట్ ఇంకాస్త ముందుకెళ్ళింది. బొడ్డుకు రింగ్స్ పెట్టుకోవడం లాంటివి ఎందుకు అని ప్రశ్నిస్తే ఈ చాట్ కింకి సెషన్ కాదు అంటూ రిప్లై ఇచ్చింది మాళవిక.

ఆ తర్వాత మరో నెటిజన్ ఇంకాస్త హద్దులు దాటి స్కిన్ షోలు చేయడం మానేసి సీరియస్ గా నటించడం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అని అడిగి ఆమె కోపానికి బలయ్యాడు. ఆ ప్రశ్నకు సీరియస్ అయిన ఈ గ్లామర్ బ్యూటీ గ్లామర్ షో ఎప్పటికీ ఆపను. ఎందుకంటే నా ఇష్టం... సింపుల్ ఇందులో నీకేమైనా సమస్య ఉందా? అంటూ ఘాటుగా స్పందించింది. ఇంకేముందీ మరోసారి ఎవ్వరూ తన గ్లామర్ విషయంలో మాట్లాడకుండా దిమ్మ తిరిగేలా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X