For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గుర్రంపై బికినీలో దర్శనమిచ్చిన ఎన్టీఆర్ బ్యూటీ.. 11 ఏళ్ళ తరువాత షాక్ ఇచ్చేలా..

  |

  కొంతమంది హీరోయిన్స్ ఎక్కువకాలం స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకోకపోయినప్పటికి మంచి నటిగా మాత్రం గ్యాప్ లేకుండ సినిమాలు చేస్తున్నారు. గ్లామర్ డోస్ ఎంత పెంచినా కూడా యాక్టింగ్ విషయంలో సరికొత్తగా కనిపించకపోతే హీరోయిన్స్ ఎక్కువ కాలం కొనసాగలేరు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ కు సైతం నటనతో గట్టిపోటీని ఇచ్చిన నటిమణుల్లో మమతా మోహన్ దాస్ ఒకరు. చాలా కాలం తరువాత ఈ బ్యూటీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది.

  సమ్మర్ లో హీట్ పెంచేస్తోన్న అనన్యా పాండే

  నటనతో కూడా డామినేట్ చేసింది

  నటనతో కూడా డామినేట్ చేసింది

  సినిమా ప్రపంచంలో హీరోయిన్స్ మధ్య పోటీ తీవ్రత చాలా గట్టిగానే ఉంటుంది. హాట్ హీరోయిన్ల నుంచి పోటీ ఎదుర్కోవాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఇక 11 ఏళ్ళ క్రితం కేవలం గ్లామర్ తోనే కాకుండా మమతా మోహన్ దాస్ నటనతో కూడా డామినేట్ చేసింది. ఎలాంటి పాత్ర చేసినా కూడా సినిమాలో హైలెట్ అయ్యేలా చేసేది.

  క్యాన్సర్.. భర్త విడాకులు..

  క్యాన్సర్.. భర్త విడాకులు..

  కరెక్ట్ గా బిజీ అవుతున్న క్రమంలోనే ఒక రెండు మూడు డిజాస్టర్స్ వలన కొంత అప్సెట్ అయ్యింది. అలాగే అప్పుడు ఆమె క్యాన్సర్ బారిన కూడా పడింది. పైగా అదే సమయంలో మమతా మోహన్ దాస్ భర్త కూడా ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. పర్సనల్ గా ప్రొఫెషినల్ గా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె ఒంటరిగానే ఫైట్ చేసింది.

  అక్కడ మాత్రం బిజిగానే ఉంది

  అక్కడ మాత్రం బిజిగానే ఉంది

  మమతా మోహన్ దాస్ తెలుగు సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చినప్పటికీ తన సొంత బాషా మళయాళంలో మాత్రం బిజిగానే ఉంది. క్యాన్సర్ నుంచి కొలుకోవాడానికి ఆమెకు పెద్దగా సమయం పట్టలేదు. ఇక తెలుగులో కొన్ని పవర్ఫుల్ పాత్రలు చేయడంతో అభిమానుల గుండెల్లో బలంగా పాతుకు పోయింది. కొన్ని సినిమాలు ప్లాప్ అయినప్పటికీ మమతా నటన విషయంలో మాత్రం ఆడియెన్స్ ఎప్పుడు నిరాశ చెందలేదు.

  సింగర్ గా కూడా

  సింగర్ గా కూడా

  మమతా మోహన్ దాస్ అంటే ఒక యాక్టర్ మాత్రమే కాదు. ఆమెలో ఒక మంచి సింగర్ కూడా ఉన్నారు. అప్పట్లో దేవిశ్రీప్రసాద్, ఎమ్ఎమ్.కీరవాణి లాంటి అగ్ర సంగీత దర్శకులు ఆమెతో రెగ్యులర్ గా పాటలు పాడించేవారు. ఆకలేస్తే అన్నం పెడతా, రాఖీ రాఖీ, ఒలమ్మి తిక్క రేగిందా పాటతో మమతా తన పాటలతో అప్పట్లో హోరెత్తించారు.

  యమదొంగ సినిమాలో..

  యమదొంగ సినిమాలో..

  ఇక జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో ఆమె ఎన్టీఆర్ తో సమానంగా నటనలో పోటీని ఇచ్చింది. డ్యాన్స్ లో కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ ను మెప్పించింది. మమతా మోహన్ దాస్ కెరీర్ మొత్తంలో ఆమెకు ఎక్కువ క్రేజ్ అందించిన సినిమా కూడా అదే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో ఒక స్పెషల్ గ్లామరస్ పాత్రలో కనిపిస్తూనే లేడి యముడిగాగా కూడా ఆదరగొట్టేసింది.

  Karthik Rapolu Gives Suggestions To Debut Directors | Ek Mini Katha
  బికినీలో ఫోటోషూట్..

  బికినీలో ఫోటోషూట్..

  ఇక చాలా కాలం తరువాత మమతా మోహన్ దాస్ ఒక ఫొటో షూట్ తో షాక్ ఇచ్చింది. ఇటీవల ఒక గుర్రంపై బికినీ టైప్ లో ఉన్న డ్రెస్ తో అందంగా మెరుస్తూ కనిపించింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. తెలుగులో ఆమె చివరగా నాగార్జున కేడి సినిమాలో కనిపించింది. ఇక ఇన్నేళ్ల తరువాత తెలుగు అడియెన్స్ కూడా ఆశ్చర్యపోయేలా ఘాటైన లుక్కుతో దర్శనమిచ్చింది. ఇక త్వరలోనే ఒక ద్విభాషా చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించనుందట.

  English summary
  Mamata Mohandas was once one of the actresses who gave tough competition to the top heroines in her career starting. She was diagnosed with cancer while being busy. Afterwards he fought and won. Now it is ready for re-entry in Telugu again. Rajamouli was also shocked at her talent at the time.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X