మీనాక్షిని భయపెట్టిన ఆ క్షణం.. స్టార్ హీరోతో కలిసి..!
ఈ మధ్య కాలంలోనే తెలుగు సినిమాకి సహా సౌత్ సినిమాకి చాలా మంది హీరోయిన్స్ పరిచయం అయ్యారు. కాగా వీరిలో చాలా మంది మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్స్ కొడితే ఇంకొందరు డిజాస్టర్ తోనే కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఇలా తెలుగు సినిమాలో ఒక ప్లాప్ తో మొదలైనప్పటికీ వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంటున్న హాట్ బ్యూటీస్ లో యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఒకామె అని చెప్పవచ్చు.
కాగా మీనాక్షి చౌదరి తెలుగులో మాస్ మహారాజ రవితేజ నటించిన క్రైమ్ యాక్షన్ సినిమా "ఖిలాడీ"తో డెబ్యూ ఇవ్వగా మొదటి సినిమా లోనే ఓ రేంజ్ లో తాను రెచ్చిపోయింది. ఇక్కడ నుంచే ఆడియెన్స్ అటెన్షన్ అందుకున్న తాను ఆ సినిమా ప్లాప్ అయినప్పటకీ మరిన్ని అవకాశాలు తెలుగు సినిమాలో చేజిక్కించుకుంది.

అయితే ప్రతీ హీరో లేదా హీరోయిన్ కి ఎప్పుడూ కొంచెం ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని తప్పకుండా ఉంటుంది. అలానే కొందరు చిన్న వయస్సులోనే తమ ఏజ్ కి మించిన పాత్రలు కూడా చేసినవారు ఉన్నారు. ఇలానే మీనాక్షి చౌదరి కూడా చేసిన ఓ రోల్ పట్ల తాను భయపడినట్టుగా ఇటీవల రివీల్ చేసింది.
దాదాపు ప్రతీ సినిమాలో కూడా ఒక యంగ్ అండ్ హాట్ హీరోయిన్ గానే కనిపించిన మీనాక్షి చౌదరి తెలుగులో ఒక్క సినిమాలో మాత్రం అమ్మ పాత్రలో కనిపించింది. ఒకప్పుడు ఉన్న సీనియర్ హీరోయిన్లే చాలా మంది ఏజ్ అయినా కూడా తల్లి పాత్రలు లాంటివి చేసేందుకు ఇష్టపడే వారు కాదు అలాంటిది మీనాక్షి చౌదరి హీరో దుల్కర్ సల్మాన్ తో "లక్కీ భాస్కర్" అనే సినిమాలో ఏడేళ్ల పిల్లాడి తల్లిగా కనిపించింది.

దీనితో తాను ఆ సినిమాకి తీసుకున్న డెసిషన్ పట్ల కొంచెం భయపడిందట. తాను అమ్మ పాత్రలో సూట్ అవుతానా లేదా? తన ఫాలోవర్స్ తనని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనే చాలా సంశయంలో పడిపోయానని ఆమె తెలిపింది. కానీ ఫైనల్ గా సినిమా రిలీజ్ అయ్యాక ఆమెని జనం యాక్సెప్ట్ చేయడంతో ఊపిరి పీల్చుకుందట. ఇలా తన కెరీర్లో చేసిన ఈ అన్ని పాత్రల్లో ఆమెని లక్కీ భాస్కర్ లో చేసిన రోల్ మాత్రం బాగా భయపెట్టింది చెప్పాలి.
కాగా తెలుగులో ఒక ప్లాప్ ఒక హిట్ తో కొనసాగుతున్న మీనాక్షి చౌదరి ఆల్రెడీ ఈ ఏడాదిలో భారీ హిట్ ని సొంతం చేసుకుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కలయికలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో ఆల్ టైం రికార్డు హిట్ ఆమె కొట్టింది. ఇందులో తనతో పాటుగా మరో బ్యూటీ ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో సహా తమిళ భాషల్లో మరిన్ని వరుస సినిమాలతో మీనాక్షి ఫుల్ బిజీగా మారి మంచి డిమాండ్ ని ఏర్పర్చుకుంది.


Click it and Unblock the Notifications











