Guntur Kaaram Event: ఆ ఫోన్ రాగానే..త్రివిక్రమ్‌లా రెండు చేతులు జేబులో పెట్టుకొని.. మీనాక్షి చౌదరీ షాకింగ్‌గా
గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, చినబాబు, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. భారీగా హాజరైన అభిమానుల జనసందోహం మధ్య అట్టహాసంగా ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరీ మాట్లాడుతూ..
నమస్కారం గుంటూరు. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్యూ. ఆయన నుంచి చాలా నేర్చుకొన్నాను. మిమ్మల్ని గురూజీ ఎందుకు అంటారో నాకు అర్ధమైంది. ఈ ఆఫర్ ఇచ్చిన నాగవంశీ, చినబాబుకు థ్యాంక్స్ అని మీనాక్షి చౌదరీ అన్నారు.

ఒక రోజు నాకు ఓ ఫోన్ వచ్చింది. మీరు మహేష్ బాబు పక్కన హీరోయిన్‌గా తీసుకొన్నామని అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ట్రెండింగ్ డైలాగ్ గుర్తుకు వచ్చింది. ఆయన చెప్పిన డైలాగ్ రెండు చేతులు జేబులో పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్లిన అనుభూతి కలిగింది అని మీనాక్షి చెప్పారు.

గుంటూరు కారంలో ఫస్ట్ డే షూటింగ్‌లో మహేష్ బాబుతో సీన్ చేసినప్పుడు చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. నాకు ఆయన కంఫర్ట్ ఇవ్వడంతో నేను చక్కగా నటించాను. మహేష్ బాబు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరో. ఆయనతో నటించే అవకాశం రావడం గర్వంగా ఉంది. మహేష్ ఫ్యాన్స్‌కు మాస్ సినిమా వస్తున్నది. థియేటర్లలో కలుద్దాం అని మీనాక్షి చౌదరీ చెప్పింది.


Click it and Unblock the Notifications











