బుల్లి గౌనులో తెగించిన మీరా జాస్మిన్: ఈ ఏజ్‌లోనూ డోస్ పెంచేసింది గురూ!
తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ మంది భామలు మాత్రమే కొన్ని సినిమాలకే మంచి ప్రభావాన్ని చూపించారు. తద్వారా చాలా కాలం పాటు తమదైన రీతిలో ప్రేక్షకులను అలరించారు. అందులో మీరా జాస్మిన్ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో అనతి కాలంలోనే అదిరిపోయే ఫాలోయింగ్‌ను అందుకున్న ఈ భామ.. ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మీరా జాస్మిన్ తెగ హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని బోల్డు ఫొటోలు షేర్ చేసింది. ఆ సంగతులు మీకోసమే!
అమ్మాయి బాగుంది అంటూ
మలయాళ అమ్మాయి అయిన మీరా జాస్మిన్ టీనేజ్‌లోనే 'సూత్రధారన్' అనే సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఆ తర్వాత అదే భాషలో చాలా సినిమాలను చేసింది. ఈ క్రమంలోనే 'రన్' అనే మూవీతో తమిళంలోకి, 'మౌర్య' అనే చిత్రంతో కన్నడంలోకి కూడా అడుగు పెట్టింది. అదే సమయంలో 'అమ్మాయి బాగుంది' మూవీతో తెలుగులోకి వచ్చింది.

ఫుల్ పాపులర్.. స్టార్లకు జోడీ
దక్షిణాదిలోని అన్ని సినీ ఇండస్ట్రీలో సందడి చేసిన మీరా జాస్మిన్‌కు తెలుగులో భారీ ఆఫర్లు దక్కాయి. ఈ క్రమంలోనే పవన్‌తో 'గుడుంబా శంకర్', రవితేజతో 'భద్ర', బాలయ్యతో 'మహారధి' సహా ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే, ఇందులో కొన్ని మాత్రమే హిట్లుగా నిలిచాయి. దీంతో 2013లో వచ్చిన 'మోక్ష' మూవీ తర్వాత మీరా టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది.

పర్సనల్ లైఫ్‌లో ఇబ్బంది
సుదీర్ఘ కాలం పాటు మీరా జాస్మిన్ సౌత్ ఇండియా మొత్తంలో హవాను చూపించి తన రేంజ్ పెంచుకుంది. అయితే, పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం ఆమె ఫెయిల్ అయిందనే చెప్పాలి. దీనికి కారణం ఆమె భర్తతో విడాకులు తీసుకోవడమే . ఇక, 2014 మీరా దుబాయ్‌కు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌ను మరో వివాహం చేసుకుంది. ఇప్పుడు అతడితోనూ కలిసి ఉండట్లేదని అంటున్నారు.
రీఎంట్రీతో.. ఆ పాత్రల్లోనే
కెరీర్ తొలినాళ్లలో వరుసగా సినిమాలు చేసిన మీరా జాస్మిన్.. 2018 తర్వాత చాలా కాలం పాటు వెండితెరకు దూరంగా ఉండిపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆమెకు ఆఫర్లు దక్కుతూనే ఉన్నాయి. ఇలా గత ఏడాది మలయాళంలో 'మక్కల్' అనే సినిమాలో నటించింది. ఇటీవలే 'విమానం' మూవీతో వచ్చింది. ఇలా మరికొన్నింటిలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.
సోషల్ మీడియాలో బిజీగా
హీరోయిన్‌గా ఎంటరైన తర్వాత అత్యుత్తమ ప్రతిభతో ఉత్తమ నటిగా అనిపించుకున్న మీరా జాస్మిన్ చాలా కాలంగా పెద్దగా ఆఫర్లను దక్కించుకోవడం లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ముందుకు సాగిపోతోంది.

ఏజ్‌తో సంబంధం లేదు
మీరా జాస్మిన్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనదైన రీతిలో అందాల ప్రదర్శన చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ ట్రెండింగ్‌లో ఉంటోంది. అంతేకాదు, ఎక్కువగా సీక్రెట్ అందాలను చూపించే వాటినే పంచుకుంటోది. దీంతో మీరా ఫొటోలు, వీడియోలకు భారీ స్పందన దక్కుతోంది. అలాగే, ఆమెకూ క్రేజ్ పెరుగుతోంది.

మీరా బోల్డ్ పిక్స్ వైరల్‌గా
సినిమాల పరంగా ఎంతో పద్దతైన పాత్రల్లో కనిపించిన మీరా జాస్మిన్.. సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె క్యాజువల్ గౌన్ ధరించి విపరీతంగా అందాల ప్రదర్శన చేస్తోంది. దీంతో మీరా అందాలు కుర్రకారును కవ్విస్తూనే ఉన్నాయి. ఫలితంగా ఈ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











