Meera Jasmine ఒకప్పుడు హోమ్లీగా.. ఇప్పుడు మీరా జాస్మిన్ ఇంత హాట్‌గానా?

మీరా జాస్మిన్ చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని క్రేజ్ సంపాదించింది . కెమెరా ముందు తనదైన కట్టు బొట్టుతో యువ హృదయాలను కొల్లగొట్టి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఒకప్పుడు హోమ్లీ లుక్స్‌తో ప్రేక్షకుల చేత ఈలలు వేయించి గోల పెట్టించిన ఈ భామ.. సడెన్‌గా గేరు మార్చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మీరా జాస్మిన్ పోస్ట్ చేస్తున్న ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట అగ్గిరాజేశాయి.

పూర్తిగా లుక్ మార్చేసిన మీరా..

పూర్తిగా లుక్ మార్చేసిన మీరా..

ఒకప్పుడు బొద్దుగా కనిపిస్తూ మత్తెక్కించిన మీరా జాస్మిన్ ఇప్పుడు.. నెవర్ బిఫోర్ అనేలా నాజూకుగా తయారైంది. బక్కచిక్కడమే కాకుండా ఎప్పుడూ నేచురల్‌గా కనిపించే ఆమె ట్రాక్ మార్చేసి ప్రస్తుతం సొగసుల వల వేస్తోంది. సోషల్ మీడియాను అస్త్రంగా వాడేస్తూ మరోసారి తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తోంది.

సినిమాల్లోకి మీరా రీ- ఎంట్రీ

సినిమాల్లోకి మీరా రీ- ఎంట్రీ

కొన్నేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మీరా జాస్మిన్.. తిరిగి రీ- ఎంట్రీకి సిద్దమైనట్లు ఆమె తీరు స్పష్టం చేస్తోంది. ఈ సారి హాట్ డోస్ కూడా పెంచి కెమెరా ముందుకు రావడానికి రెడీ అన్నట్లుగా ఆమె హింట్స్ ఇస్తోంది. అందుకే తన నాజూకు అందాలను ఎరగా వేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలపై హవా నడిపిస్తోంది.

రెచ్చిపోయి అందాల ప్రదర్శన

రెచ్చిపోయి అందాల ప్రదర్శన

కాలంతో పాటు మారాలి అనే ఆలోచనకు వచ్చిదేమో తెలియదు కానీ ఇప్పుడు మీరా జాస్మిన్ తీరు చూసి అంత షాక్ అవుతున్నారు. అందాల ప్రదర్శనకు తెరలేపి మైండ్ బ్లాక్ చేస్తోంది ఈ హీరోయిన్. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రెచ్చిపోయింది మీరా. ఎద అందాల తలపులు తెరిచి ఆ ఫొటోలను తన సామజిక మాధ్యమాల వేదికగా పంచుకోవడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్‌తో రొమాన్స్.. చిట్టి నడుముతో చిత్ర హింసలు


మీరా అదృష్టం బాగుండి కెరీర్ ఆరంభంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది. గుడుంబా శంకర్ సినిమాలో పవన్ తో రొమాన్స్ చేసి ఫేమ్ కొట్టేసింది. తన చిట్టి నడుముతో చిత్ర హింసలు పెట్టడమే గాక ఆ తర్వాత పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఆడిపాడింది.

మీరా పెళ్లి.. దుబాయ్‌లో కాపురం

అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్, మహారధి, రారాజు, యమగోల మళ్ళీ మొదలైంది, మా ఆయన చంటి పిల్లాడు, గోరింటాకు, బంగారు బాబు, అ ఆ ఇ ఈ, ఆకాశ రామన్న లాంటి సినిమాల్లో నటించిన మీరా.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. 2014 సంవత్సరంలో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేసే అనిల్ జాన్ టైటస్‌ను పెళ్ళాడి దుబాయ్ వెళ్లిపోయింది. తిరిగి ఇన్నేళ్లకు మళ్ళీ సినిమాల వంక చూస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X