మరో టాలీవుడ్ హీరోయిన్ ఎంగేజ్‌మెంట్.. అది జరిగిన ఆరేళ్ల తర్వాత ఇలా!
ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా పరిశ్రమల్లో ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా శుభకార్యాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఫేమస్ అయిన హీరో, హీరోయిన్లు ఒక్కొక్కరుగా పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇలా ఇటీవలే టాలీవుడ్ జంట అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా నిశ్చితార్థం చేసుకుని సర్‌ప్రైజ్ చేసింది. ఇంతకీ ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరిని? పెళ్లి ఎప్పుడు జరగబోతుంది? అనే విషయాలను చూసేద్దాం పదండి!
అలా మొదలైన మేఘా కెరీర్
తమిళనాడుకు చెందిన మేఘా ఆకాష్ టీనేజ్‌లో ఉన్నప్పుడే సినిమాలపై మక్కువ కనబరిచింది. ఈ క్రమంలోనే నితిన్ హీరోగా నటించిన 'లై' సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. దీని తర్వాత అదే హీరోతో 'ఛల్ మోహనరంగ' అనే సినిమాలోనూ నటించింది. ఈ రెండింటి తర్వాత మేఘా తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటింది.

ఆ సినిమాలతో పాపులారిటీ
సినిమా ప్రయాణంలో మేఘా ఆకాష్ చాలా సినిమాల్లో నటించింది. కానీ, అందులో కొన్ని మాత్రమే విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా తెలుగులో ఆమె 'రాజ రాజ చోర', 'డియర్ మేఘా', 'ప్రేమదేశం', 'రావణాసుర', 'భూ', 'మను చరిత్ర' వంటి సినిమాలు చేసింది. అందులో కొన్ని హిట్లు ఉన్నాయి. అలాగే, తమిళంలోనూ ఈ భామ సక్సెస్‌లు సాధించింది.
అతడి ప్రేమలో.. లీకైందిగా
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న మేఘా ఆకాష్.. పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొంత కాలంగా ఆమె ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, మేఘా తన స్నేహితుడినే పెళ్లి చేసుకోబోతుందని టాక్ వినిపిస్తోంది. కానీ, ఈ న్యూస్‌లపై ఈ హీరోయిన్ అస్సలు స్పందించనే లేదు.

ఎంగేజ్‌మెంట్ చేసుకుంది
ప్రేమ వ్యవహారం గురించి వార్తలు ప్రచారం అవుతోన్న తరుణంలోనే హీరోయిన్ మేఘా ఆకాష్ ఎంగేజ్‌మెంట్ చేసుకుని సర్‌ప్రైజ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు, 'నా కోరిక నెరవేరింది. మేము ఎప్పటికీ సంతోషంగా నవ్వుతూ ఉంటాము. నా లవ్ లైఫ్ అయిన విష్ణుతో ఎంగేజ్‌మెంట్ అయింది' అని చెప్పింది.
ఆరేళ్ల బంధం.. ఈ ఏడాదే
మేఘా ఆకాష్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైరల్ అవుతోన్న వేళ.. అసలు ఆమె ప్రియుడు ఎవరని చాలా మంది డౌట్ పడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. అతడి పేరు సాయి విష్ణు. వీళ్లిద్దరూ ఆరేళ్ల క్రితమే ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. అప్పటి నుంచి సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడుపుతున్నారు. ఇలా ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక, వీళ్ల పెళ్లి ఈ ఏడాదే జరుగుతుందని టాక్.


Click it and Unblock the Notifications











