హాట్ వీడియోతో షాకిచ్చిన మోనాల్ గజ్జర్: చాలా రోజుల తర్వాత ఇంత ఘాటుగా కనిపించడంతో!

తెలుగు చేసింది తక్కువ సినిమాలే అయినా విశేషమైన గుర్తింపును అందుకుంది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. చాలా కాలం క్రితమే టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ భామ.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ షో ద్వారా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ అమ్మడు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సైతం అందాల విందు చేస్తూ ఫ్యాన్స్‌కు మజాను పంచుతోందీ బ్యూటీ. ఇందులో భాగంగానే తాజాగా మోనాల్ ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా పరిచయం.. దూరమైంది

అలా పరిచయం.. దూరమైంది

చిన్న వయసులోనే హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన మోనాల్ గజ్జర్.. 'సుడిగాడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో మరో రెండు మూడు చిత్రాల్లో నటించినా ఇవేమీ ఆమెకు అంతగా గుర్తింపును, ఆఫర్లను తీసుకు రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె టాలీవుడ్‌కు దూరమైంది. అయితే, వేరే భాషల్లో మాత్రం మంచి పేరు సంపాదించుకుంది.

బిగ్ బాస్‌లో లవ్ ట్రాకుతో క్రేజ్

బిగ్ బాస్‌లో లవ్ ట్రాకుతో క్రేజ్

సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాకున్నా తెలుగు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని పట్టేసింది మోనాల్ గజ్జర్. షో ఆరంభంలోనే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఫేమస్ అయిందామె. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో కలిసి ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత పాపులర్ అయింది. ఇలా గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకుల కారణంగానే ఈ బ్యూటీకి మరింత క్రేజ్ సొంతమైంది.

బయట కూడా అతడితో రచ్చ

బయట కూడా అతడితో రచ్చ

షోలో ఉన్నప్పుడు అఖిల్ సార్థక్‌తో కలిసి మోనాల్ గజ్జర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చుట్టూ ఎంతో మంది ఉన్నా.. వీళ్లిద్దరే జంటగా కనిపిస్తూ ఉండేవారు. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో హల్‌చల్ చేసేవారు. ఇలా హౌస్‌లో మాత్రమే కాదు.. బయటకు వచ్చిన తర్వాత కూడా తరచూ కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో నిత్యం వార్తల్లోనే ఉంటూ వస్తోందీ బ్యూటీ.

వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది

వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది


రియాలిటీ షో పుణ్యమా అని మోనాల్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీగా క్రేజ్ వచ్చేసింది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆ మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. ప్రముఖ ఛానెల్‌లో ఓంకార్ నడిపిస్తోన్న 'డ్యాన్స్ ప్లస్' అనే షోలో జడ్జ్‌గా చేసింది. అలాగే, మరికొన్ని సినిమాలు, షోలు చేస్తూ బిజీ అయింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

సినిమాలు చేస్తున్నా చేయకున్నా.. మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ రచ్చ చేస్తోంది. తద్వారా ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటూ దూసుకుపోతోందామె.

అప్పుడప్పుడూ అవి షేర్ చేసి

అప్పుడప్పుడూ అవి షేర్ చేసి

మోనాల్ గజ్జర్.. సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక ఫొటోలను వదులుతూ ఉంటోంది. అందులో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్‌లతో పాటు వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది. తద్వారా సినిమాలు చేయకున్నా ఫ్యాన్స్‌కు మజాను పంచడంతో పాటు నిత్యం హాట్ టాపిక్ అయిపోతోందీ బ్యూటీ.

Recommended Video

Bigg Boss ని కోర్టుకు ఈడుస్తా.. వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు - CPI Narayana
హాట్ హాట్ ఫోజులతో వీడియో

హాట్ హాట్ ఫోజులతో వీడియో


మోనాల్ గజ్జర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె డిజైనర్ డ్రెస్ వేసుకుని క్లీవేజ్ షో చేస్తోన్న ఫొటోలు కనిపించాయి. అన్నింట్లోనూ ఈ బ్యూటీ ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X