Mrunal thakur: ఆ రోజుల్లోనే అతడితో కమిటయ్యా.. చావు కబురు చల్లగా చెప్పిన మృణాల్
సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీనే కాకుండా... బాలీవుడ్ లోనూ తన సత్తా ఏంటో చూపిస్తోంది మృణాల్ ఠాకూర్. హిందీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో నటిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈభామ.అయితే తెలుగులో సీతారామం సీనిమాతో అటు సౌత్, నార్త్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు హిందీ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా ఈ భామ.. తన లవ్ అండ్ బ్రేకప్ విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...
మొదటి సినిమాతోనే...:మృణాల్ ఠాకూర్.. ఈ భామ గత ఏడాది విడుదలైన సీతారామంతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సాధించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది. ఇక మృణాల్ అనే కంటే.. సీత పేరుతోనే ఆమె క్రేజ్ దక్కించుకుంది. అంతలా ఈ సినిమాలో తన అందం, అభినయం, నటనతో ఆకట్టుకుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. సీతగా మృణాల్.. తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయేలా నటించింది.

సోషల్ మీడియాలో ట్రోలింగ్:ఇక ఈ సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వచ్చాయి. స్టార్ హీరోల పక్కన ఛాన్స్ వచ్చాయి. అయితే తెలుగు ప్రేక్షకులు సీతగా చూసిన మృణాల్ ను పొట్టి బట్టల్లో చూడలేక పోయారు. చాలా మంది ఏంటీ సీతా ఇలా అయ్యావ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేశారు. ఆ విషయం పక్కన పెడితే.. తాజాగా ఈ భామ తన లవ్ అండ్ బ్రేకప్స్ గురించి చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్.. కంగుతింటున్నారు.

బోల్డ్ సీన్స్ లో నటించి...:మృణాల్ తాజాగా నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2. అయితే ఈ సిరీస్ లో మృణాల్ చాలా బోల్డ్ గా నటించింది. లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. సీతారామంలో ఎంతో పద్ధతిగా, సాఫ్టుగా కనిపించిన మృణాల్.. లస్ట్ స్టోరీస్ లో అందాలను ఆరబోస్తూ.. బోల్డ్ గా నటించింది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ సందర్భంగా ఆమె తనకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలని బయటపెట్టింది.

ఫస్ట్ లవ్ బ్రేకప్:మృణాల్ ఠాకూర్ కు టెన్త్ క్లాసులోనే ఫస్ట్ లవ్ ప్రపోజల్ వచ్చిందట. అతను చాలా అందంగా, హ్యాండ్సమ్ గా ఉండేవాడని చెప్పుకొచ్చింది. ఆ వయసులో మెచ్యూరిటీ లేకపోవడం వల్ల అతడికి కమిటయ్యా అంటూ చావు కబురు చల్లగా చెప్పుకొచ్చింది. కొద్ది రోజులు అతనితో బాగానే ఉందట.. కానీ పది తర్వాత పైచదువుల కోసం.. ముంబయి వెళ్లానని తెలిపింది. దానివల్ల అతనితో రిలేషన్ కట్ అయిందట. ఈ న్యూస్ విన్న నెటిజన్స్ షాక్ కు గురవుతున్నారు.

ప్రస్తుతం సింగిల్:ఇలా టెన్త్ క్లాస్ లోనే మృణఆల్ ఠాకూర్ లవ్, బ్రేకప్ కానిచ్చేసింది. అయితే ఇండస్ట్రీలో రాకముందు కూడా మరో వ్యక్తితో మృణాల్ ప్రేమలో పడిందట. కానీ అతనికి కూడా బ్రేకప్ చెప్పిందట. ప్రస్తుతం తాను సింగిల్ స్టేటస్ ను మెయింటైన్ చేస్తున్నానని మృణాల్ అంటోంది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో రెండు సినిమాలు చేస్తుండగా.. అందులో నానితో ఒక సినిమా, రెండోది విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తోంది.


Click it and Unblock the Notifications











