Mrunal Thakur: నేను అందుకు పనికిరానన్నారు.. కానీ ఈరోజు!
మృణాల్ ఠాకూర్.. ఈ పేరు తెలియని, ఈమె అందాల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటన కల్గిన ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. సీతా రామం, హాయ్ నాన్న సినిమాల్లో అద్భుతమైన నటన కనబర్చిన ఈమె.. కెరియర్ తొలి నాళ్లలో చాలా ట్రోలింగ్స్ ఎదుర్కున్నట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తాను అందుకు పనికి రాదంటూ పలువురు చేసిన కామెంట్ల గురించి వివరించింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2014లో విట్టి దండు అనే సినిమాతో మరాఠీ సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత సురాజ్య అనే మరో సినిమా చేసింది. ఆ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ క్యూట్ బ్యూటీ 2018లో లవ్ సోనియా అనే సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరసుగా హిందీలో సినిమాలు చేస్తూ పోయింది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసిన ఈమె.. 2022లో సీతా రామం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది.

ఈ సినిమాలో నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసి.. అందరి మనసుల్లో సీతగా నిలిచిపోయింది. సంప్రదాయ పద్ధతిలో చక్కనైన చీర కట్టులో మెరిసి.. దేశవ్యాప్తంగా ఉన్న అమ్మాయిలు అంతా తనను ఫాలో అయ్యేలా చేసుకుంది. బాలీవుడ్ లో అన్ని రోజులు సినిమాలు చేసినా రాని ఫేమ్ ఈ ఒక్క సినిమాతో దక్కింది. ఇక తాజాగా వచ్చిన హాయ్ నాన్న సినిమాలోనూ... నాని భార్యగా, ఓ బిడ్డకు తల్లిగా, యశ్నగా అదరగొట్టింది. ఇందులో కూడా బ్లాక్ కలర్ చీర, ముక్కు పుడుకతో కనిపించి కుర్రకారు మదిని దోచేసింది.
తెలుగు ప్రేక్షకులు జీవితాంతం గుర్తు పెట్టుకునే రెండు క్యారెక్టర్లలో కనిపించిన ఈమె తన కెరియర్ ప్రారంభంలో అనేక ట్రోలింగ్స్ ఎదుర్కున్నట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముఖ్యంగా తాను గ్లామర్ పాత్రలకు పనికి రానని చాలా మంది కామెంట్లు చేశారని.. ఎప్పుడూ అలాంటి పాత్రల్లోనే కనిపించాల్సిన అవసరం కూడా లేదు కదా అంటూ వివరించింది. ఇక్కడ వస్తున్నటువంటి మంచి మంచి పాత్రలు.. తనకు బాలీవుడ్ లో దొరకడం లేదని చెప్పుకొచ్చింది. ఒక సీత, యశ్న వంటి పాత్రలు వస్తే.. ఎలాంటి సినిమాలో అయినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా సరే చేయడానికి తాను సిద్ధమే అని వెల్లడించింది.

సంవత్సరానికి ఇన్ని సినిమాలు చేయాలి, అన్ని సినిమాలు చేయాలనే నియమాలు ఏవీ తనకు లేవని.. మంచి పాత్రలే లక్ష్యంగా తాను ముందుకు వెళ్తున్నట్లు వివరించింది. గ్లామర్ రోల్ అవసరం ఉంటే చేస్తానని.. పాత్ర ఏది డిమాండ్ చేసినా తాను పాత్రకు న్యాయం చేసేందుకు ఎంతైనా కష్టపడతానని మృణాలు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ పాత్రలో కూడా జీవించిందని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఇది కూడా ఆమె కెరియర్ కు మైలురాయిగా నిలుస్తుందా లేదా అనేది.


Click it and Unblock the Notifications











