నిషా కళ్లతో మత్తెక్కించే చూపులతో Nabha Natesh అందాలు... యంగ్ బ్యూటీ గ్లామర్ ట్రీట్ అందిరిందిగా!
అందం, అభినయం.. దానితో పాటు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా... ఎందుకో నభా నటేష్ కు కలిసి రావడం లేదు. ఈ భామకు సక్సెస్ రేటు బాగానే ఉన్నా.. ఎందుకో సినిమాలు మాత్రం చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. తన అందచందాలను నెటిజన్స్ తో పంచుకుంటుంది ఈ బ్యూటీ. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోస్ మాత్రం కేక పుట్టిస్తున్నాయి. అవి చూశారంటే.. మీరూ మైమరిపోతారంతే! మరి ఓ సారి లుక్కేయండి మరి!
కన్నడ బ్యూటీ.. టాలీవుడ్ లోకి: కర్ణాటకకు చెందిన నభా నటేష్... సినిమాల్లోకి వచ్చే ముందే మోడల్ గా పాపులారిటీని తెచ్చుకుంది. ఆ తర్వాత కన్నడంలో వజ్రకాయ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. ఇక కన్నడంలో వరుస సినిమాలు చేస్తుండగానే.. తెలుగులో నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సుధీర్ బాబు నటించిన ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా చేసి.. మంచి పేరును తెచ్చుకుంది. ఇక ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇస్మార్ట్ శంకర్ తో క్రేజ్: ఇక ఆ తర్వాత ఈ బ్యూటీకి మంచి అవకాశాలు వచ్చాయి. అదిగో అనే చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. ఈ సినిమా అంతగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకోలేదు. ఇక ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసింది. ఇక ఈ సినిమాతోనే ఆమె పాపులారిటీ, క్రేజ్ రెట్టింపు అయింది. రామ్ పోతినేని హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురించింది. ఇక ఈ సినిమా ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

సినిమాలకు దూరం: ఇస్మార్ట్ శంకర్ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ హీరోయిన్ గా మారిన నభా నటేష్ కు ఆ తర్వాత తెలుగులో బాగానే ఆఫర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే రవితేజతో 'డిస్కో రాజా', సాయిధరమ్ తేజ్ తో 'సోలో బ్రతుకే సో బెటర్', బెల్లం కొండ శ్రీనివాస్ తో 'అల్లుడు అదుర్స్', నితిన్ తో 'మాస్ట్రో' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలు ఆమెకు మంచి పేరును, క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అయితే ఇటీవల ఈ అమ్మడు.. సినిమాల్లో కనిపించడం లేదు.

సోషల్ మీడియాలో యాక్టివ్: ఈ బ్యూటీ చేతిలో సినిమా ఆఫర్ల లేనట్లు తెలుస్తోంది. దానికి కారణం ఇండస్ట్రీలోకి కొత్త అందాలు వస్తుంటాయి.. పోతుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ బ్యూటీకి సెకండ్ హీరోయిన్ ఛాన్సులు, స్పెషల్ ఐటెం సాంగ్స్ రావడంతో.. అవకాశాలను వదిలేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

నభా నటేష్ గ్లామర్ ట్రీట్: సోషల్ మీడియాలో తన అంద చందాలతో రచ్చ చేస్తుంటుంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ కుర్రకారును టెంప్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బిగుతైన డ్రెస్ లో తన ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ.. నిశా కళ్లతో మత్తేక్కించే చూపులతో నభా నటేష్ మాయ చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్... లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











