Nabha Natesh: చార్లీ చాప్లిన్‌లా మారిపోయినా నభా నటేష్.. ఎంత కామెడీగా కనిపిస్తుందో చూడండి!
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ నభా నటేష్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడి అందరినీ మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా చార్లీ చాప్లిన్ లుక్ ను రీక్రియేట్ చేసింది. అందులో అచ్చం ఆయనలాగే ముస్తాబై క్యూట్ క్యూట్ ఫొజోలు పెడుతూ ఫొటోలు దిగింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నన్ను దోచుకుందువటే చిత్రం ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న నభా నటేష్ గురించి అందరికీ తెలిసిందే.. మొదటి చిత్రం తర్వాత రవిబాబు అదుగో చిత్రంలో కనిపించింది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఎప్పుడూ తన అభిమానులకు టచ్ లో ఉంటుంది.

తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. అందులో నభా నటేష్.. కమెడియన్ చార్లీ చాప్లిన్ లుక్ ను రీక్రియేట్ చేసింది. ముఖ్యంగా లోపల వైట్ షర్ట్ వేసుకుని పైనుంచి బ్లాక్ బ్లేజర్ వేసుకుంది. అలాగే బ్లాక్ కలర్ ప్యాంటు వేసుకుని హ్యాట్ పెట్టుకుంది. అంతేకాదండోయ్.. మూతిన సేమ్ టు సేమ్ చార్లీ చాప్లిన్ లా మీసాలు పెట్టుకుంది.

చేతిలో ఓ స్టిక్ కూడా పట్టుకుని అచ్చం ఆయనలాగే ముస్తాబైంది. కేవలం రెడీ అవ్వడమే కాదు.. ఆ లుక్ లోనే ఫొటోలు దిగింది. భలే క్యూట్ గా, కమెడీగా ఫోజులు పెడుతూ.. అందరినీ నవ్వించే ప్రయత్నం చేసింది. సేమ్ టు సేమ్ చార్లీ చాప్లిన్ లా కనిపిస్తున్న నభా నటేష్ ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ప్రతీ ఒక్కరూ అచ్చం చార్లీలాగే కనిపిస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. కేవలం అందాలు ఆరబోయడం మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ ఇలాంటి లుక్స్ రీక్రియేట్ చేయడం చాలా మంచిది అంటూ చెప్పుకొస్తున్నారు.
నభా నువ్వేం చేసినా చాలా అందంగా ఉంటుందని కొందరు, ఎంత ముద్దుగా కనిపిస్తున్నావో తెలుసా ముద్దుగుమ్మ అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ చార్లీ చాప్లిన్ ఫొటోలను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ ఇట్.


Click it and Unblock the Notifications











