For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ టైమ్‌లో నన్నలా చూసి చెడ్డ పని చేశాననుకున్నారు: ఫొటోలు చూపిస్తూ సీక్రెట్లు లీక్ చేసిన నమిత

  |

  సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకాదరణను అందుకొని ఫుల్ పాపులర్ అవుతుంటారు. అలాంటి వారిలో బొద్దుగుమ్మ నమిత ఒకరు. చాలా ఏళ్ల క్రితం తెలుగు చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ.. దక్షిణాదిలోని భాషలన్నింటిలోనూ హీరోయిన్‌గా నటించింది. వివాహం తర్వాత సినిమాలను తగ్గించిన ఈ అమ్మడు.. రాజకీయాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన కొన్ని సంచలన విషయాలు బయట పెట్టింది. ఆ వివరాలు మీకోసం!

  ‘సొంతం'తో పరిచయం.. అందరు హీరోలతో

  ‘సొంతం'తో పరిచయం.. అందరు హీరోలతో

  ఆర్యన్ రాజేశ్ హీరోగా నటించిన ‘సొంతం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది నమిత. ఆ తర్వాత టాలీవుడ్‌లోని దాదాపు చాలా మంది హీరోలతో కలిసి నటించింది. కానీ, ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో ఫ్లాప్ హీరోయిన్‌గా ఆమెకు ముద్ర పడిపోయింది. ఈ కారణంగానే మిగిలిన భాషల సినిమాల్లో నటించి సక్సెస్ బాటలో పయనించింది ఈ హాట్ బ్యూటీ.

  బాలయ్యతో లాస్ట్.. అక్కడ చేస్తూనే ఉంది

  బాలయ్యతో లాస్ట్.. అక్కడ చేస్తూనే ఉంది

  తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన ‘సింహా' సినిమానే నమితకు చివరిది. ఆ తర్వాత మరో ద్విభాషా చిత్రంలో నటించి టాలీవుడ్‌కు బైబై చెప్పేసింది. కానీ, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ చిత్రాల్లో మాత్రం ఆమె నటిస్తూనే ఉంది. అంతేకాదు, ఓ ఇంగ్లీష్ సినిమాలో సైతం లీడ్ రోల్ చేసింది. తెలుగులో ప్రభాస్ ‘బిల్లా' నమిత చేసిన హాట్ షో అందరికీ గుర్తే ఉంటందని చెప్పొచ్చు.

  బిగ్ బాస్ ఎంట్రీ.. అప్పట్లో హాట్ టాపిక్‌గా

  బిగ్ బాస్ ఎంట్రీ.. అప్పట్లో హాట్ టాపిక్‌గా

  తమిళంలో ఎన్నో వివాదాల నడుమ ప్రసారం అయిన షోలలో బిగ్ బాస్ ఒకటి. దీని మొదటి సీజన్‌లో నమిత కంటెస్టెంట్‌గా పాల్గొంది. హౌస్‌లో ఈ అమ్మడు వ్యవహరించిన తీరు, వేసుకున్న బట్టల విషయంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో నమిత దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. షో తర్వాత పలు చిత్రాల్లో నటించే అవకాశాలు అందుకుందీ భామ.

  తెలుగు వ్యక్తితో పెళ్లి.. వేగం తగ్గించిందిగా

  తెలుగు వ్యక్తితో పెళ్లి.. వేగం తగ్గించిందిగా

  బొద్దుగా ఉన్నప్పటికీ నమితకు వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే 2017లో వీరేంద్ర చౌదరి అనే తెలుగు అబ్బాయిని వివాహం చేసుకుందామె. అప్పటి నుంచి సినిమాల వేగం తగ్గించడంతో పాటు ఫిజిక్‌పైనా దృష్టి సారించింది. ఎక్కువ సమయం జిమ్‌లో గడుపుతూ చాలా వరకు బరువు తగ్గిపోయింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

  రాజకీయాల్లోకి ఎంట్రీ.. అప్పుడే పదవిలో

  రాజకీయాల్లోకి ఎంట్రీ.. అప్పుడే పదవిలో

  దాదాపు ఇరవై ఏళ్ల పాటు సినీ రంగంలో యాక్టివ్‌గా ఉంది నమిత. దాదాపు నలభై సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. 2019లో రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంది. అప్పటి నుంచి ఎంతో యాక్టివ్‌గా పని చేసిన నమితను.. తమిళనాడు ఎగ్జిగ్యూటీవ్ మెంబర్‌గా ప్రమోట్ చేశారు.

  సంచలన విషయాలు లీక్ చేసిన నమిత

  సంచలన విషయాలు లీక్ చేసిన నమిత

  సినిమాలు, రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది నమిత. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంతో పాటు ఎన్నో విషయాలు పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గతం, ప్రస్తుత ఫొటోలను షేర్ చేసిన ఈ బొద్దుగుమ్మ.. కొన్ని పర్సనల్ సీక్రెట్లను రివీల్ చేసి షాకిచ్చింది.

  నన్ను చూసి చెడ్డ పని చేశా అనుకున్నారు

  నన్ను చూసి చెడ్డ పని చేశా అనుకున్నారు

  ఆ పోస్టులో ‘నేనప్పుడు లావుగా ఉండేదాన్ని. నన్నలా చూసి మందు అలవాటు ఉందని అనుకున్నారు. కానీ, నేను డిప్రెషన్‌లో ఉన్నానని చాలా మందికి తెలీదు. అంతెందుకు నాకే ఆ విషయం తెలీదు. రోజూ ఫుల్‌గా తింటుండేదాన్ని. నా పట్ల నేనే ఎంతో వేదనను అనుభవించాను. ఈ విషయాలేమీ ఎవరికీ తెలియవు. కానీ, ఇప్పుడు మొత్తం మారిపోయింది' అంటూ చెప్పుకొచ్చింది నమిత.

  English summary
  Namitha Vankawala is an Indian film actress who has predominantly been active in the South Indian film Industry. She is currently a state executive member of the Bhartiya Janata Party in Tamil Nadu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X