For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రాతో కనిపించి షాకిచ్చిన నందినీ రాయ్: ఏకంగా షర్ట్ మొత్తం విప్పేసి.. ఘాటు ఫోజులతో రచ్చ

  |

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. చాలా తక్కువ సమయంలోనే ఇంటర్నేషనల్ బ్రాండ్లకు ప్రచారకర్తగా మారి.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది హైదరాబాదీ బ్యూటీ నందినీ రాయ్. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో తన సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ అమ్మడు.. ఎనలేని గుర్తింపును అందుకుంది. అయితే, అవకాశాలను దక్కించుకోవడంలో మాత్రం విఫలం అయింది. ఇక, సోషల్ మీడియాలో మాత్రం నందినీ రాయ్ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా బ్రాతో దిగిన ఓ ఫొటోను షేర్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ వివరాలు మీకోసం!

  మిస్ ఆంధ్రా.. బాలీవుడ్‌ ఎంట్రీ

  మిస్ ఆంధ్రా.. బాలీవుడ్‌ ఎంట్రీ

  హైదరాబాద్‌కు చెందిన నందినీ రాయ్ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. అప్పుడు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లకు అంబాసీడర్‌గా పని చేసి.. ఆ రంగంలో సత్తా చాటింది. ఈ క్రమంలోనే ‘ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది.

   తెలుగులో తక్కువే... అక్కడే

  తెలుగులో తక్కువే... అక్కడే

  పేరుకు తెలుగు మూలాలు ఉన్న అమ్మాయే అయినా.. నందినీ రాయ్ టాలీవుడ్‌లోకి మాత్రం చాలా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చింది. ‘మాయ' అనే సినిమాలో మంచి పాత్రను పోషించినా అంతగా గుర్తింపును అందుకోలేదు. కానీ, ఆ తర్వాత ‘మోసగాళ్లకు మోసగాడు', ‘సిల్లీ ఫెలోస్' వంటి చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు హిట్ మాత్రం దక్కలేదు. దీంతో అడపాదడపా కనిపిస్తోంది.

  పంథాను మార్చుకున్న భామ

  పంథాను మార్చుకున్న భామ

  మూడేళ్ల క్రితం ప్రసారం అయిన తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్‌లో నందినీ రాయ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో పాల్గొన్న సమయంలో ఆమెకు ఎనలేని గుర్తింపు వచ్చింది. దీంతో ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా అనుకున్నారు. కానీ, తెలుగులో సినిమాలు రాలేదు. కానీ, పంథాను మార్చుకుని గ్లామర్ షోకు సిద్ధం అవడంతో పలు భాషల్లో ఛాన్స్‌లు దక్కించుకుంటూ సాగుతోంది.

   ఆ వెబ్ సిరీస్‌లో అలాంటి పాత్ర

  ఆ వెబ్ సిరీస్‌లో అలాంటి పాత్ర

  తాజాగా నందినీ రాయ్ ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' అనే వెబ్ సిరీస్‌లో ఫీమేల్ లీడ్ రోల్ చేసింది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సిరీస్‌కు మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా ఇది భారీ క్లిక్కులతో దూసుకుపోతోంది. ఇక, ఇందులో నందినీ రాయ్ పోషించిన బోల్డ్ రోల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఆమె పేరు మారుమ్రోగుతోంది. కొన్ని సీన్స్‌లో శృతి మించిన రొమాన్స్ చేసిందామె.

  అందులో రచ్చ చేస్తోన్న భామ

  అందులో రచ్చ చేస్తోన్న భామ

  సినిమా ఆఫర్లు ఉన్నా లేకున్నా నందినీ రాయ్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితంతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, తరచూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ తన మార్క్ చూపిస్తోంది. ఫలితంగా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోంది.

  గ్లామర్ ట్రీట్‌తో వల వేస్తుందిగా

  గ్లామర్ ట్రీట్‌తో వల వేస్తుందిగా

  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నందినీ రాయ్.. తరచూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎక్కువ శాతం గ్లామర్ ట్రీట్‌తో కాక రేపుతోంది. ఎప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తూ వస్తోంది. ఇక, ఈ మధ్య ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ తన అందాలతో కనువిందు చేస్తోంది. ఫలితంగా ఈ మధ్య కాలంలో ఆమె ఇంటర్నెట్‌ను ఊపేస్తుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  బ్రాతో కనిపించి షాకిచ్చిన నటి

  బ్రాతో కనిపించి షాకిచ్చిన నటి

  తాజాగా నందినీ రాయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె షర్ట్ మొత్తం విప్పేసి బ్రాతో కనిపించింది. ఎరుపు రంగు చొక్కాకు బ్లాక్ బ్రా వేసుకున్న ఆమె.. కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా నందినీ రాయ్ షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. తద్వారా ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Tollywood Heroine, Bigg Boss Fame Nandini Rai Very Active in Social Media. Now She Shared Hot Bra Photo in her Instagram. This Pic Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X