హ్యకింగ్‌కు గురైన నయనతార ట్విట్టర్.. లేడీ సూపర్ స్టార్ అకౌంట్‌లో ఏం చేశారంటే?
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు గట్టి షాక్ తగిలింది. సోషల్ మీడియాలో తన అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేయడం ఆమె అభిమానులకు దిగ్బ్రాంతికి గురి చేసింది. తన అకౌంట్ హ్యాక్ అయింది అని అనుమానం రావడంతోనే ఆమె సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను అలెర్ట్ చేశారు. ఆమె చెప్పిన వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలోని ట్విట్టర్‌లో నయనతారకు వెరిఫైడ్ అకౌంట్ ఉంది. తన అభిమానులకు ఎప్పుడూ సమాచారం అందిస్తూ తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను ఎప్పటికప్పుడు అందిస్తూ గణనీయంగా ఫాలోవర్స్ పెంచుకొన్నది. అయితే తన అకౌంట్‌లోకి కొందరు హ్యాకర్లు దూరినట్టు అనుమానం రాగానే అలర్ట్ అయ్యారు.

నా ట్విట్టర్ అకౌంట్ హ్యకింగ్ గురింది. ఏదైనా తప్పుడు సమాచారం.. అసమంజసమైన పోస్టులు వస్తే వాటిని పట్టించుకోకండి.. నా అకౌంట్‌లోకి అనుమానాస్పదం కొన్ని లింకులు వస్తున్నాయి. వాటిని ఎవరో పోస్టు చేశారు. కాబట్టి ఏదైనా తప్పుడు పోస్టులు ఉంటే నేను పోస్టు చేసినవి కాదని మీరు గమనించాలి అని చెప్పారు.
తన అకౌంట్ హ్యాక్ కావడంతో వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారికి సమాచారం అందించి తగు జాగ్రత్తలు తీసుకొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకొన్నారు. అయితే ఆమె అకౌంట్ హ్యాక్ కావడంతో ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు.


Click it and Unblock the Notifications











