Nayanthara భారీగా రెమ్యునరేషన్ పెంచిన నయనతార.. పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Nayanthara Remunaration: లేడీ సూపర్ స్టార్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మకు మలయాళీ డైరెక్ర్ సత్యన్ అంతిక్కాడ్ మనస్సినక్కరే అనే సినిమా ద్వారా తొలి ఛాన్స్ ఇచ్చాడు. అక్కడ కెరియర్ ప్రారంభించిన ఈ క్యూట్ బ్యూటీ తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అద్భుతమైన చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈమె ఇటీవలే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో జత కట్టి జవాన్ చిత్రంలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తొలి బాలీవుడ్ చిత్రమే సూపర్ డూపర్ హిట్టు అయ్యేసరికి ఆమెకు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ క్యూట్ బ్యూటీకి బాలీవుడ్ లో రెండో సినిమా అవకాశం వచ్చినట్లు సమాచారం. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తాజా చిత్రంలో నయనతారను ఓ ప్రధాన పాత్రలో నటించమని సంప్రదించారట. ఈ సందర్భంగానే నయనతార భారీగా రెమ్యునరేషన్ అడిగిందట.

Heroine Nayanthara Demanding Huge Remunaration For Her Next Bollywood Cinema Check Details here

అయితే ఈమె తొలి హిందీ చిత్రం జవాన్ కు 10 కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకుంది. అయితే తన రెండో చిత్రం కోసం ఏకంగా 13 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కావాలని అడిగిందట. రోజురోజుకూ నయనతారకు వయసు పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.. అలాగే వయసుతో పాటు రెమ్యునరేషన్ ను, అందాన్ని కూడా పెంచుకుంటూ పోతోందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా తన లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ను అలాగే కాపాడుకుంటోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో తన 75వ చిత్రంతో పాటు క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న టెస్ట్, మన్నాంగట్టిసిన్స్ 1960 అనే సినిమాల్లో నటిస్తోంది. అలాగే జయం రవి సరస మరోసారి తనీ ఒరువన్ 2 చిత్రంలో కూడా నయనతార కనిపించబోతుందని టాక్ నడుస్తోంది.

Heroine Nayanthara Demanding Huge Remunaration For Her Next Bollywood Cinema Check Details here

ఇదిలా ఉండగా... నయన తార డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొంత కాలానికే తాము తల్లిదండ్రులు అయ్యాము, కవల పిల్లలు పుట్టారంటూ చెప్పి అందరినీ షాక్ కు గురి చేశారు. ఆ తర్వాతే వీరు సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయినట్లు తెలిసింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. నానా రభాసా అయింది. అయినా నయన్, విఘ్నేష్ దంపతులు... ఈ సమస్యలను తీర్చుకొని తమ పిల్లలతో హాయిగా గడుపుతున్నారు.

Heroine Nayanthara Demanding Huge Remunaration For Her Next Bollywood Cinema Check Details here

ఈ నెలలోనే వీరి పిల్లల పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపారు. ఇంట్లో అతి తక్కువ మంది బంధువులు, స్నేహితుల నడుమ ఈ వేడుకను సెలబ్రేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇటు నయనతారతో పాటు అటు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ జంట.. ఫ్యామిలీ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు. పిల్లలతో ఎక్కువగా గడుపుతుంటారు. అందకు సంబంధించిన అన్ని ఫొటోలను నెట్టింట పెడుతుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X