Nayanthara: భర్తతో పాటు ఆ ఇద్దరితోనూ ప్రేమలో పడిన నయనతార.. వాలంటైన్స్​ డేన ఒక్క పోస్ట్​తో క్లారిటీ

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఎవరు అనగానే? ప్రస్తుతం సినీ అభిమానులంతా టక్కున చెప్పే పేరు నయనతార. అమాయకంగా నటించాలన్నా, గ్లామర్‌ డోస్‌ ఎక్కువగా చూపించాలన్నా, లేదంటే హోమ్లీగా కనిపించాలన్నా, అన్యాయాన్ని ఎదిరించాలన్నా.. ఇలా ఏ పాత్ర అయినా సరే ఒదిగిపోయి నటిస్తుంది నయనతార. అయితే నేడు వాలంటైన్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది నయన్. తన భర్తతో పాటు మరో ఇద్దరిని ఎంతగానో ప్రేమించినట్లు చెప్పుకొచ్చింది. మరి వారెవరు? ఇంతకీ ఏం పోస్ట్ చేసింది? ఈ స్టోరీ చదివి తెలుసుకుందాం..

వరుస సినిమాలతో జోరుగా :
అగ్ర కథానాయిక, బహు బాషా నటి నయనతార గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లేడీ సూపర్ స్టార్​గా ఇండియన్ ఫిల్మ్​ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ భామ ఇంకా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్​లో దూసుకెళ్తోంది. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్​ కంటెంట్​ ఉన్న సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్​గానూ రాణిస్తోంది. రీసెంట్​గా షారుక్​తో కలిసి జవాన్ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో షారుక్ ప్రేయసిగా ఆకట్టుకుంది. ఆ తర్వాత అన్నపూరణి సినిమాతో అలరించింది.

Heroine Nayanthara Intrestesting Valentines Day Post Viral in Social Media


సోషల్ మీడియాలో యాక్టివ్​గానే :
పర్సనల్ లైఫ్ విషయానికొస్తే దర్శకుడు విఘ్నేశ్​తో ప్రేమాయణం నడిపి ఆ మధ్యనే పెళ్లి చేసుకుంది నయన్. ఈ జంటకు సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. వారికి ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టారు. ఉయిర్ అంటే ప్రాణం. ఉలగం అంటే ప్రపంచం అని అర్థమట. అయితే నయనతార సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలా అప్పుడప్పుడు తన భర్త, పిల్లలకు సంబంధించిన పిక్స్​ను షేర్ చేస్తూ ఉంటుంది. వారి మీద ఉన్న ప్రేమను సోషల్​ మీడియాలో వ్యక్తపరుస్తూ ఉంటుంది.

అయితే నేడు వాలంటైన్స్​ డే సందర్భంగా నయన్​ - విఘ్నేశ్ ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. విఘ్నేశ్​.. హ్యాపీ వాలంటైన్స్ డే.. ప్రేమను నమ్మే ప్రతి ఒక్కరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. మీరు నా ఉయిర్. నేను మీ ఉలగం. ఇప్పుడు మీరు, నేను.. ఉయిర్, ఉలగం మారాము. ఇప్పుడే కాదు రాబోయే జన్మలోనూ మరెన్నో అందమైన అద్భుత క్షణాలను పంచుకోవాలి ఆశిస్తున్నాను. లవ్ యూ సో మచ్ ఉయిర్ అంటూ విఘ్నేశ్ నయన్‌పై ప్రేమను కురిపించారు రాసుకొచ్చారు.

Heroine Nayanthara Intrestesting Valentines Day Post Viral in Social Media

ఇక నయనతార... ఉయిర్, ఉలగం ఫోటోలను షేర్ చేసింది. ఐ లవ్ యు మై ఉయిర్, ఐ లవ్ యు మై ఉలగం. నా వాలంటైన్స్ డేను మరింత అందంగా చేసినందుకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. భర్త విఘ్నేశ్​ను ఉద్దేశించి మీకు తెలియనంతగా, చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను. కానీ నా ప్రేమను రోజు చూపిస్తున్నానని అనుకుంటున్నాను. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. 10 సంవత్సరాల స్వఛ్చమైన ప్రేమ మనది. నాకు ఈ ప్రేమ దొరికినందుకు అదృష్టంగా భావిస్తున్నాను అని రాసుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X