Nayanthara: సొగసులతో ఊరిస్తున్న నయనతార.. లేటు వయసులో అందాల జాతర!
Nayanthara: నయనతార.. అందానికి అందం, అభినయానికి అభినయం ఆమె సొంతం. విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ... విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాధించుకున్న ఈ ముద్దుగుమ్మ సౌత్ లేడీ సూపర్ స్టార్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టి అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తోనే హిందీలో మొదటి సినిమా చేసి అక్కడి ప్రేక్షకులకు దగ్గర అయింది. ఓ వైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఆగస్టు 31వ తేదీ నుంచే ఇన్ స్టాగ్రామ్ లో నయన్:
గతంలో నయనతార ఇన్ స్టాగ్రామ్ వాడలేదు. కానీ ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నుంచి ఆమె ఇన్ స్టాగ్రామ్ వాడుతోంది. ముందుగా వైట్ అండ్ వైట్ డ్రెస్సు వేసుకొని తన కొడుకులతో కలిసి ఉన్న ఫొటోలను నయనతార షేర్ చేసింది. ఇక అప్పటి నుంచి తనకు సంబంధించిన సినీ అప్ డేట్లతో పాటు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ నైట్ డ్రెస్సు వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అందులో అదిరిపోయే లుక్కులో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

వైట్ ప్యాంట్ విత్ వైట్ షర్టు వేసుకొని వైట్ వాచ్ ను స్టైల్ చేసింది. క్రీం కలర్ షూస్ వేసుకొని సోఫాపై పడుకుంది. హెయిర్ లీవ్ చేసుకొని అందాలు ఆరబోస్తూ అదరగొడుతోంది. రెండు చేతులు పైకి ఎత్తి తల వెనక పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. క్యూట్ లుక్స్ ఇస్తూ కుర్రకారు గుండెల్లో హీటెక్కిస్తోంది. వైట్ డ్రెస్సులో నయనతార చాలా అందంగా కనిపిస్తోంది. రోజురోజుకూ వయసు పెరుగుతున్నా ఆమె అందాలు ఏమాత్రం తగ్గట్లేదు. రోజురోజుకూ మొహం మరింతగా వెలిగిపోతుంది.

నయనతార ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు నాలుగు లక్షల లైకులు రాగా.. వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టి రెండు నెలలు కూడా కాకముందే 6.2 మిలియన్ల ఫాలోవర్లు వచ్చారు. ఆమెకు సంబంధించిన అన్ని విషయాలతో పాటు ఆమె పెట్టే ఫొటోలు చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తుంటారు. ఆమె ఏ పోస్ట్ పెట్టిన లైకులు, షేర్లు, కామెంట్లతో రచ్చ చేస్తుంటారు. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు చూసిన అభిమానులు... రియల్ క్వీన్, అదిరిపోయావు, అందంగా ఉన్నావు అంటూ కామెంట్లు చేశారు.

అలాగే ఓ నెటిజెన్ స్పందిస్తూ.. ఎన్ని రూమర్లు వచ్చినా, నెగిటివ్ ట్రోలింగ్స్ వచ్చినా పట్టించుకోకుండా ఇలా ప్రశాంతంగా ఉండే మీ తీరు అందరికీ ఆదర్శనీయం అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే మరో నెటిజెన్.. బాలీవుడ్ హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చే అందం నయనతార అంటూ రాసుకొచ్చాడు. చూడాలి మరి ఈ మద్దుగుమ్మ ఏ రేంజ్ లో అవకాశాలు దక్కించుకొని అదరగొడుతుందో.


Click it and Unblock the Notifications











