Game On కష్టమైనా డైరెక్టర్ అలా చేయించాడు..లిప్‌లాక్స్‌తో ఫుల్ రొమాన్స్.. హీరోయిన్ నేహా సోలంకి

కస్తూరి క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించిన యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ గేమ్ ఆన్ (Game On). ఈ చిత్రంలో యువ హీరో గీతానంద్, 90ml ఫేమ్ నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లు, దర్శకుడు, నిర్మాత మాట్లాడుతూ..

నేను హీరో గీతానంద్ క్లాస్‌మెట్స్. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్‌మి. ఆ సమయంలో మంచి సినిమాలు తీయాలని అనుకొనే వాళ్లం. ఒక మంచి కథ నా ముందుకు వచ్చినప్పుడు ఈ సినిమాను చేయాలని అనుకొన్నాను. గేమ్ ఆన్ సినిమా నాకు తొలి ప్రాజెక్ట్. నవాబ్ గ్యాంగ్స్ మంచి పాటలు ఇచ్చారు. సినిమా యాక్షన్ ఎపిసోడ్స్, రొమాన్స్ సన్నివేశాలు ఎంగేజింగ్‌గా ఉంటాయి అని నిర్మాత రవి కస్తూరి అన్నారు.

Heroine Neha Solanki about Liplocks and Romance with Geetanand in Dayanands Game On Movie

జీవితంలో ఇక ఈ లైఫ్ చాలు అనుకొన్న ఓ యువకుడు రియల్ టైమ్ సైకాలజీ గేమ్‌లోకి ప్రవేశించాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గేమ్‌ను ఎవరు ఆడించారు అనేది సినిమా కథ. యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ అంశాలతో కూడిన ఈ మూవీ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మధుబాల గారు సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌లా ఉంటుంది అని దర్శకుడు దయానంద్ చెప్పారు.

Heroine Neha Solanki about Liplocks and Romance with Geetanand in Dayanands Game On Movie

తెలుగులో 90ml సినిమాలో మంచి అమ్మాయిగా కనిపించాను. కానీ గేమ్ ఆన్ సినిమాలో ఆ పాత్రకు భిన్నంగా నటించాను. ఈ సినిమాలో సిగరెట్ స్కోక్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. డైరెక్టర్ దగ్గరుండి నాకు నేర్పించారు. ఈ మూవీలో రొమాన్స్ ఉంటుంది. లిప్‌లాక్స్ ఉంటాయి. కానీ కథ డిమాండ్ మేరకే అవన్నీ ఉంటాయి. ఈ సినిమాలో నేను మీరు ఊహించని పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాకు సపోర్ట్ చేయండి. థియేటర్‌లోనే చూడండి అని హీరోయిన్ నేహా సోలంకి అన్నారు.

హీరో గీతానంద్ మాట్లాడుతూ.. గేమ్ ఆన్ కోసం చాలా రిసెర్చ్ చేసి కథను తయారం చేశాం. కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్లుగా ఉన్న సినిమా ఇది. మార్కెటింగ్ ఉద్యోగం చేసే యువకుడు జీవితంపై విరక్తి చెంది ఓ గేమ్‌లో పడితే ఎలా ఉంటుందనే కథ. ఆదిత్య మీనన్, మధుబాల అద్బుతమైన పాత్రల్లో నటించారు. నా తమ్ముడు దయానంద్‌కు మంచి పేరు వస్తుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మమ్మల్ని ఆదరిస్తారు అని అనుకొంటున్నాను అని నేహా సోలంకి చెప్పారు.

Heroine Neha Solanki about Liplocks and Romance with Geetanand in Dayanands Game On Movie

నటీనటులు: గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, వాసంతి, కిరిటీ, శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌ త‌దిత‌రులు

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: దయానంద్
నిర్మాత‌: ర‌వి క‌స్తూరి
మ్యూజిక్ డైర‌క్ట‌ర్: అభిషేక్ ఏ ఆర్
పాటలు: న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ - అరుణ్‌
సినిమాటోగ్రఫి: అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌
ఎడిట‌ర్: వంశీ అట్లూరి
బ్యానర్‌: కస్తూరి క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2024-02-02

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X