ఆ ఫోటోలు వాడొద్దంటూ హాట్ బ్యూటీ గరం గరం .. ఓ రేంజ్‌లో ఇచ్చిపడేసిందిగా

ప్రెజెంట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్స్ కొందరు కనిపిస్తారు. కెరీర్ స్టార్ట్ చేసిన కొన్నేళ్ల లోనే మంచి క్రేజ్ ని ఫాలోవర్స్ ని కొందరు హీరోయిన్స్ తెచ్చుకుంటారు. అలాగే ఒక్క నటన మాత్రమే కాకుండా గ్లామర్ డోస్‌తో కూడా అలరించే హీరోయిన్స్ కూడా కొందరు ఉండగా వారిలో యంగ్ అండ్ హాట్ సెన్సేషన్ నిధి అగర్వాల్ కూడా ఒకరు.

దర్శకుడు పూరి జగన్నాథ్ అలాగే హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన హిట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ తో ఈ ముద్దుగుమ్మ క్రేజీ హిట్ అందుకొని టాలీవుడ్‌లో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చారు. హీరోయిన్స్ అన్నాక పలు కామెంట్స్, మార్పింగ్ ఫోటోలు ఇప్పుడు రీసెంట్‌గా మరీ ఘోరంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కృత్రిమ మేధస్సుతో ఊహించని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో డిజైన్ చేస్తున్నారు.

heroine nidhhi agerwal shocking post on ai pics

ఆ మధ్య బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పిక్స్ కొన్ని షాకింగ్‌గా వైరల్ అయ్యాయి. చాలా మంది అవి నిజమే అనుకున్నారు కానీ.. సీన్ కట్ చేస్తే అవి కూడా ఏఐ సాయంతోనే డిజైన్ చేసారని తేలింది. ఇపుడు డైరెక్ట్‌గా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్(ట్విట్టర్)లో పెట్టిన కొత్త ఫీచర్‌తో మరిన్ని ఫోటోలు చేసేస్తూ తమ క్రియేటివిటీ చూపిస్తున్నారు. కాగా దీనిపైనే ఆ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు అనిపిస్తుంది.

ఈ కొన్ని రోజుల్లోనే ఎక్స్ లో అనేక ఫోటోలు ఓ రేంజ్ లో సర్క్యులేట్ అయ్యాయి. మరి అవి ఏమన్నా తనకి చిరాకు తెప్పించాయో ఏమో కానీ ఈ ఏఐ పిక్చర్స్‌తో తాను చాలా కన్ఫ్యూజ్ అయ్యిపోతున్నాను. ఏది నిజమైన ఫోటో, ఏది ఏఐతో చేస్తుందో అర్ధం కావట్లేదు అంటూ నిధి కామెంట్స్ చేసింది. దీనితో తన పోస్ట్ వైరల్ గా మారింది. రీసెంట్‌గానే ఓ స్టార్ హీరోయిన్ని కూడా నిధి అగర్వాల్ టార్గెట్ చేసి పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

heroine nidhhi agerwal shocking post on ai pics

ఇక ఇవి పక్కన పెడితే నిధి అగర్వాల్ మన తెలుగు టాప్ హీరోస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "హరిహర వీరమల్లు" , పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌తో క్రేజీ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం "ది రాజా సాబ్" లలో నటిస్తుంది. వరుసగా ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ ఈమె బిజీగా ఉంది. తెలుగు సహా తమిళ్ సినిమాలో కూడా నటించిన ఈ హాట్ హీరోయిన్ ప్రస్తుతం ఈ సినిమాలు మాత్రమే చేతిలో పెట్టుకుంది. ఇవి బ్రేక్ ఇచ్చి ఆమెకి మరిన్ని ఆఫర్లు అందిస్తాయో లేదో చూడాలి. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది‌లోనే రిలీజ్‌కి రాబోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X