నా క్యారెక్టర్‌‌ను డిసైడ్ చేయగలరా? నిధి అగర్వాల్ హాట్ కామెంట్స్

Raja Saab: కల్కి వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ కావటం, ఈ జానర్ లో ప్రభాస్ ఫస్ట్ టైమ్ చేస్తుండడం ఆసక్తిని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందోనని కోట్లాది మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నాను. భారీ అంచనాలు నెలకొన్న సినిమాపై మరింత హైప్స్ పెంచేలా హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు కెరీర్ మొదట్లో కొన్ని ఫ్లాప్‌ సినిమాలు చవిచూసింది. కానీ, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. నటించిన చిత్రాలకు మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలో ఈ బ్యూటీకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజాసాబ్(The Rajasab), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు(Harihara Veeramallu)' నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇలా ఒకేసారి రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తుండటంతో ఇండస్ట్రీ హట్ టాపిక్ గా మారింది.

heroine Nidhi Agarwal interesting comments on Prabhas Maruti combo movie The Raja Saab

ఒక కాలంలో టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అలాగే.. సమయం దొరికినప్పుడల్లా పలు షోల్లో, ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన పర్సనల్ అండ్ కెరీర్ గురించి అప్డేట్స్ ను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ప్రభాస్ ' రాజా సాబ్ ' సినిమాపై మరింత హైప్స్ పెంచేలా హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

తాజాగా నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి 'రాజా సాబ్' చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. "సాధారణంగా నేను గ్లామరస్, హాట్ పాత్రల్లో నటిస్తానని భావిస్తారు. కానీ, ప్రభాస్ 'ది రాజా సాబ్‌ 'తో నాపై ఉన్నా అభిప్రాయాన్ని మార్చుకుంటారని, నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ది రాజా సాబ్‌లో నా పాత్ర నా రెగ్యులర్ హాట్ పాత్రల నుండి భిన్నంగా ఉంటుంది.నా క్యారెక్టర్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతారని కచ్చితంగా చెప్పగలను. ఇక సినిమా ఎలా ఉంటుందో మీరో ఊహించుకోండి." అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నిధి కామెంట్స్ తో 'రాజా సాబ్'పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

heroine Nidhi Agarwal interesting comments on Prabhas Maruti combo movie The Raja Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నిధి అగర్వాల్ జంట నటిస్తున్న 'రాజాసాబ్'(Rajasab)మూవీకి మారుతి(Maruti) దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. కానీ, మూవీ మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్టేట్స్ లేకపోవడంతో .. ఈ మూవీ పోస్ట్ పోన్ అయిందా? అనే రూమార్స్ వస్తున్నాయి. ఈ రూమార్స్ పై క్లారిటీ రావాలంటే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే.

More from Filmibeat

Read more about: raja saab nidhi agarwal prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X