మహేష్ బాబు నా మొగుడని అప్పుడే ఫిక్స్ అయ్యా.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎమ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. హాస్య భరితమైన కంటెంట్ ను నెటిజన్లకు అందిస్తూ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తను పదో తరగతి చదువుతున్న తరుణంలోనే యూట్యూబ్ తో కెరీర్ ను ప్రారంభించింది. యూట్యూబ్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హాస్యభరితమైన 'టైప్స్' వీడియో సిరీస్ లో ఆమె గుర్తింపు పొందింది. చిన్నగా మొదలై ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ గా సంచనాలు సృష్టిస్తోంది.
ఇక నిహారిక నటిగా ఆడియెన్స్ లో మంచి గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తను మెగా థీ స్టాలియన్, జోర్డాన్ పీలా వంటి చిత్రాల్లో నటించింది. బిగ్ మౌత్ సిరీస్ లో గెస్ట్ రోల్ చేసింది. ప్రస్తుతం తమిళంలో రూపుదిద్దుకుంటున్న 'ఇదియం మురళీ'తో నటిగా సౌత్ ఆడియెన్స్ కు పరిచయం కాబోతోంది. తమిళ స్టార్ అథర్వ మురళీ - నూతన దర్శకుడు ఆకాష్ భాస్కరన్ కాంబోలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలోనే థమన్ కూడా మరో హీరోగా నటిస్తుండటం విశేషం.

తమిళ చిత్రంతోనే నిహారిక ఎన్ఎమ్ తన సినీరంగ ప్రవేశం చేయనుంది. ఈ సందర్భంగా నిహారిక ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబుపై తనకున్న ప్రేమను తెలియజేసింది. నిహారిక మాట్లాడుతూ.. తనకు ఐదేళ్ల వయస్సులోనే మహాబాబుతో లవ్ లో పడిపోపయానని.. చూసి చూడంగానే నాకు ఎంతో నచ్చాడని చెప్పింది. ఐదేళ్ల వయస్సులో 'మురారి' చిత్రంలో మహేశ్ బాబును చూసి నా ఇతనే నా మొగుడు అంటూ ఇంట్లో వాళ్లతో చెప్పానని ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే అప్పుడు ఐదేళ్లుగా ఉన్నప్పుడు అనుకున్నానని, ఇప్పుడు అలా అంటున్నందుకు సారీ చేప్పింది.
మహేశ్ బాబు ఎంతో క్యూట్ గా ఉంటారని, మిల్కీ వైట్ తో కట్టిపడేస్తారని చెప్పుకొచ్చింది. ఆయన చాలా తక్కువ మాట్లాడుతారని, మిల్క్ కు మనిషి రూపం ఉంటే మహేశ్ లాగానే ఉంటారని తెలిపింది. ఇక మహేశ్ బాబు గురించి మరిన్ని విషయాలను పంచుకుంది. ఇండియాలోనే మహేశ్ బాబుతో రీల్ చేసిన మొట్టమొదటగా రీల్ చేసింది తననే గర్వంగా చెప్పుకుంది. ఈక గతంలో 'మేజర్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మహేశ్ బాబుతో రీల్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ మహేశ్ బాబు ను కలిసినప్పుడు కలిగిన ఫీలింగ్ బాగుందని కూడా షేర్ చేసుకుంది.
కర్ణాటకు చెందిన నిహారిక ముంబైలో పెరిగింది. అక్కడే ఆమె విద్యాభ్యాసం పూర్తైంది. ఆమెకు థియేటర్ కోర్సులపై ఎక్కువగా ఆసక్తిగా ఉండేది. ఆమె పదో తరగతి చదువుతున్న సమయంలోనే యూట్యూబ్ తెరిచి సెన్సేషన్ గా మారింది. కామెడీ వీడియోలను క్రియేట్ చేస్తూ వచ్చింది. నిహారిక ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అలాగే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసుకుంది. మొత్తానికి సోషల్ మీడియా ద్వారా దేశమంతా క్రేజ్ దక్కించుకుంది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకధీరుడు దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ29 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ ప్రారంభమై కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











