నిర్మాత రామానాయుడికి ఇష్టమైన హీరోయిన్.. హీరోతో అక్రమ సంబంధంతో కెరీర్ సర్వనాశనం.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమా పరిశ్రమలో ఈ రోజు సూపర్ స్టార్ అనుకొన్న వారు.. మరో శుక్రవారం తర్వాత డిజాస్టర్ హీరో అవ్వడం.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఫీలైన అందాల భామ మరో వారం రోజుల తర్వాత ఇండస్ట్రీ ముఖం చాటేయడం ఎన్నో సందర్భాలను చూసి ఉంటాం. అలా పెద్ద స్టార్ అయిపోతుందని అనుకొన్న హీరోయిన్లు కనుమరుగైపోయిందనే విషయం భారీగా చర్చకు వస్తుంది. అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో లెజెండరీ నిర్మాత రామానాయుడు పరిచయం చేసిన ఓ అందాల భామ స్టార్ హీరోయిన్ మారి.. ఓ హీరో చేసిన మోసానికి ఆమె కెరీర్ అథో పాతాళానికి వెళ్లింది. ఆ హీరోయిన్ కెరీర్ వివరాల్లోకి వెళితే..
పంజాబీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి నిఖిత ముంబైలో తన జీవితం కొనసాగింది. మహానగరంలోనే ఎకనామిక్స్‌లో పీజీ చేసింది. జుహులోని ఓ హోటల్‌లో డిన్నర్ చేస్తుండగా ప్రముఖ నిర్మాత రామానాయుడు కళ్లలో పడింది. ఆమె అందం చూసి హీరోయిన్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఆమెతో మాట్లాడిన ఆయన ఏకంగా హీరోయిన్ ఆఫర్ ఇచ్చేశాడు.

దాంతో తెలుగు సినిమాలో నటించడానికి నిఖిత అంగీకారం చెప్పింది. దాంతో హాయ్ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా తర్వాత ఆమె నటించిన సినిమాలు హిట్ కావడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి. దాంతో స్టార్ హీరోయిన్ అయ్యారు. తమిళ, కన్నడ భాషల్లో భారీ అవకాశాలు ఆమెను పలకరించాయి.
హాయ్ సినిమా తర్వాత మలయాళంలో ఫాహద్ ఫాజిల్‌తో ఓ సినిమాలో నటించింది. తెలుగులో ఆమె నటించిన సంబరం హిట్ కావడంతో తెలుగులో ఆఫర్లు వచ్చాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన సరోజ సినిమాలో నటించంది. అలా దక్షిణాది సినిమా పరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్ అనే హోదాను సంపాదించుకొన్నది.

తెలుగు, తమిళం, మలాయళం, కన్నడ సినిమాలో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ సమయంలో అప్పటికే వివాహితుడైన కన్నడ స్టార్ హీరో దర్శన్‌తో రిలేషన్‌షిప్ మొదలుపెట్టింది. వారిద్దరి అక్రమబంధంపై హీరో భార్య విజయలక్ష్మీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిఖితతో సంబంధం పెట్టుకొని తనను గన్‌తో కాల్చి చంపుతానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నది.
అలాంటి వివాదంలో నిఖిత ఇరుక్కోవడంతో కన్నడ సినిమా పరిశ్రమ ఆమెపై మూడేళ్ల నిషేధం విధించింది. అప్పటి నుంచి ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి. అనంతరం ఆమె కన్నడ పరిశ్రమ నుంచి దూరం వచ్చి వ్యాపారవేత్త గగన్ దీప్ సింగ్‌ను వివాహం చేసుకొన్నది. అనంతరం సినిమా పరిశ్రమకు దూరంగా ఉండిపోయింది.


Click it and Unblock the Notifications











