twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ పిట్టకథ: డైరెక్టర్ వెంకటలక్ష్మి రోల్ గురించి చెప్పగానే.. హీరోయిన్ నిత్యా శెట్టి కామెంట్స్

    |

    సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌ రావు, విశ్వంత్‌, నిత్యా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓ పిట్ట కథ'. భవ్య క్రియేషన్స్‌ పతాకం ఫై వి.ఆనందప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహించాడు. ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిత్యా శెట్టి మీడియాతో ముచ్చటించింది.

    ''నేను తెలుగమ్మాయిని చదువు మొత్తం హైదరాబాద్‌లో పూర్తి చేశాను. సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాను, అంజి , దేవుళ్ళు, సినిమా తరువాత రామానాయుడు గారి హరివిల్లు సినిమా చేశాను. ఆ సినిమా తరువాత హీరోయిన్‌గా కొన్ని మూవీస్ చేశాను. ఓ పిట్టకథ సినిమా కథ విని ఈ సినిమా చేశాను. ఆడియన్స్ నుండి మూవీకి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఓ మాంచి సినిమాలో నటించిన తృప్తి ఉంది.

    Heroine Nitya Shetty comments on O Pitta Katha

    నేను హీరోయిన్‌గా గ్లామర్ రోల్స్ చెయ్యలేదు, చేసిన పాత్రలు అన్ని నా రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు దగ్గరగా ఉన్నవి, అలాంటి పాత్రే నేను ఓ పిట్టకథ సినిమలో చేశాను. డైరెక్టర్ చందు ముద్దు తాను అనుకున్న పాయింట్‌ను అనుకున్నట్లు తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యాడు. భవ్య క్రియేషన్ ఆనంద్ గారు సినిమాను బాగా తియ్యడంతో పాటు బాగా ప్రమోట్ చేశారు. అందువల్లే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

    నేను కూచిపూడి డాన్సర్‌ని. డైరెక్టర్ చందు గారు వెంకటలక్ష్మి పాత్ర నాకు చెప్పినప్పుడు బాగా ఇష్టపడ్డాను, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మూవీ చూసి బాగుందని చెప్తుంటే సంతోషంగా ఉంది. ప్రస్తుతం తమిళ్‌లో ఒక సినిమా చేస్తున్నాను, అలాగే తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. మంచి పాత్రలు ఏ భాషలో వచ్చినా చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా'' అని చెప్పింది నిత్యా శెట్టి.

    English summary
    Brahmaji son Sanjay 'O Pitta Katha' movie is released on March 6th. Now heroine Nitya Shetty commented on this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X