For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను భయంతో ఏడుస్తుంటే హేళన చేశారు.. ఇంతకంటే దారుణం ఉండదు: పాయల్

    |

    సోషల్ మీడియా ప్రపంచంలో ట్రోలింగ్ అనేది కామన్ గా మారిపోయింది. హేళన చేయడం కూడా ఒక ఫ్యాషన్ లా మారిందని కొందరు సెలబ్రెటీలు గట్టిగానే వాదిస్తున్నారు. కానీ స్టార్స్ చేసే పనులు కూడా కొన్నిసార్లు అలానే ఉంటున్నాయని మరికొందరు కామెంట్స్ చేస్తునన్నారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురైన వారిలో పాయల్ రాజ్ పుత్ ఒకరు.

    సోషక్ మీడియాలో మంచి ఫాలోయింగ్

    సోషక్ మీడియాలో మంచి ఫాలోయింగ్

    RX100 సినిమాతో ఒక్కసారిగా సాలీడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ఆ తరువాత మెల్లగా తన క్రేజ్ ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది గాని ఎందుకో అనుకున్నంత రేంజ్ లో హిట్స్ అందుకోవడం లేదు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి గట్టి ఫాలోయింగ్ ఏర్పడుతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.

    మాదిరిగా ఎడ్చేసిన పాయల్

    మాదిరిగా ఎడ్చేసిన పాయల్

    కుర్రాళ్ళు ఈ బ్యూటీ గ్లామర్ ని అమితంగా ఇష్టపడుతున్నారని మొదటి సినిమాతోనే అర్ధమయ్యింది. ఇక ఇటీవల కరోనా టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చిన పాయల్ అనుకోకుండా ట్రోలింగ్ కి గురి కావాల్సి వచ్చింది. డాక్టర్ ఆమె ముక్కు నుంచి శాంపిల్స్ తీసుకుంటూ ఉండగా చిన్న పిల్లల మాదిరిగా ఎడ్చేసిన పాయల్ అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    వివరణ ఇచ్చిన పాయల్

    వివరణ ఇచ్చిన పాయల్

    ఇక ఆమె ఓవరాక్షన్ చేసిందని మరీ అంతలా బయపడాల్సిన అవసరం ఏముందని నెగిటివ్ కామెంగ్స్ రావడంతో వెంటనే పాయల్ వివరణ ఇవ్వక తప్పలేదు. నాకు డాక్టర్లు, సూదులు అంటే చాలా భయం. శాంపిల్స్ తీసుకునే సమయంలో నిజంగా భయం వేసింది. నిజంగా ఏడ్చేశాను. అయితే కొందరు దాన్ని ఫేక్ అనుకోని ట్రోల్ చేశారు. నా భయాన్ని హేళన చేయడం నిజంగా దారుణం.. అని పాయల్ రాజ్ పుత్ వివరణ ఇచ్చింది.

    Bigg Boss Telugu 4 : Devi Nagavalli Re Entry? !ప్రేక్షకుల డిమాండ్!! | Filmibeat Telugu
     భవిష్యత్తు సినిమాలపై స్పెషల్ ఫోకస్

    భవిష్యత్తు సినిమాలపై స్పెషల్ ఫోకస్

    ఇక ఈ 27ఏళ్ళ ఢిల్లీ భామ ఎలాగైనా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోవాలని చాలానే కష్టపడుతోంది. కానీ ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత ఒక్క సినిమా కూడా ఆమెకు క్రేజ్ తీసుకురాలేకపోయింది. సీత, వెంకీ మామా, డిస్కో రాజా వంటి డిఫరెంట్ సినిమాల్లో నటించినప్పుటికీ సక్సెస్ రాలేదు. దీంతో భవిష్యత్తు ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఒక సినిమాతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.

    English summary
    Payal Rajput screaming when the medical personnel took a nasal swab for the test. She is was looking damn scared, but her reaction turned out to be a funny one.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X