సెన్సేషన్.. పబ్‌లో బాయ్ ఫ్రెండ్ తల పగులగొట్టిన పాయల్ రాజ్ పుత్.. మరీ ఇంత వైలెంట్‌గా ఉందేంట్రా?
బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.. తన ప్రియుడు తలను పగులగొట్టింది. మామూలుగా కాదొండోయ్ బీర్ బాటిల్ తీసుకుని తలపై బలంగా కొట్టింది. అది కూడా అందరు చూస్తుండగానే పబ్ లోనే ఇదంతా జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ మాకొద్దు బాబోయ్ అంటూ కామెంట్స్ చే్ేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
టాలీవుడ్ యంగ్ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. RX 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ బ్యూటీ. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కార్తీకేయ హీరోగా చేయగా.. హీరోయిన్ గా, విలన్ గా పాయల్ నటన అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత ఈ భామకు ఆఫర్లు వెల్లువెత్తుతాయని భావించింది. కానీ అన్ని బోల్డ్ క్యారెక్టర్స్ అవకాశాలు వచ్చాయి.

అసలు ఈ బ్యూటీ దిల్లీలో పుట్టి పెరిగి ముంబైలో సెటిల్ అయింది. గ్రాడ్యూయేషన్ తర్వాత సినిమాల్లోకి రావాలని ఆశించింది. అలా పంజాబీ సీరియల్స్, సినిమాలు చేసింది. 2017 పంజాబీ చిత్రం చన్నా మేరేయా తో ఆమె చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాతే ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఆ తర్వాత సీత చిత్రంలో స్పెషల్ సాంగ్, ఆర్డీఎక్స్ లవ్ సినిమా, వెంకీ మామ చిత్రంలో వెంకటేష్ సరసన నటించే అవకాశాలు వచ్చాయి. కానీ ఏవి అంతగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
ఇక ఆ తర్వాత డిస్కోరాజా, అనగనగా ఓ అతిథి, మంచు విష్ణుతో కలిసి జిన్నా, మాయపేటిక సినిమాలు చేసింది. వీటితో పాటు పలు పంజాబీ, కన్నడ చిత్రాలు కూడా చేసింది. అయితే అనుకున్న స్థాయిలో ఈ భామకు ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఇక ఇటీవల తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితోనే మంగళవారం సినిమా చేసింది. ఇక ఈ సినిమాలో మళ్లీ బోల్డ్ పాత్రలో కనిపించింది. ఇక ఈ సినిమా పర్వాలేదనిపించింది.
ఈ అమ్మడు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. తనగురించి తన హాట్ ోఫోటోలను, పలు విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంది. తాజాగా, పాయల్ తన వాలెంటైన్స్ డే ఎలా ఎక్కడ జరుపుకుందో తెలుపుతూ ఓ వీడియోను వదిలింది. అందులో ఆమె ప్రియుడు సౌరబ్‌తో కలిసి పబ్‌లో ఉందని తెలుస్తోంది. ఇక ఓ సినిమా షూట్‌లో భాగంగా ప్రియుడి తలపై బీర్ బాటిల్‌తో పాయల్ కొట్టింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. నా వాలెంటైన్స్ డేను ఇలా జరుపుకుంటున్నానని చెప్పుకువచ్చింది.
మీరేలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది బోల్డ్ బ్యూటీ. దీనికి ఓ నెటిజన్ మళ్లీ ట్రై చేయండి అని కామెంట్ పెట్టగా.. దానికి సౌరబ్ ఇది ఒక బ్యాడ్ ఐడియా అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం పాయల్ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. ఇది చూసిన కొందరు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకొద్దు అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











