Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఇంట్లో విషాదం... నువ్వు లేకుండా బతకలేను అంటూ ఎమోషనల్ పోస్ట్
ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సంచలన సృష్టించిన పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ భామకు ఆర్ఎక్స్ 100 తర్వాత సరైనా అవకాశాలు దక్కలేదు. పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినా... ఆమెను బోల్డ్ బ్యూటీగానే చూశారు. ఇక ఇటీవల మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టింది. ఇదిలా ఉంటే.. పాయల్ రాజ్ పుత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీంతో పాయల్ ఎమోషనల్ అవుతూ.. ఓ పోస్టును షేర్ చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకుల ముందుక వచ్చింది. ఇక ఈ సినిమాతో బోల్డ్ బ్యూటీగా మారిపోయింది ఈ భామ. ఎక్స్పోజింగ్ మాత్రమే నమ్ముకున్న ఈ బ్యూటీ.... ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తోందని తెలుస్తోంది.

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీకి ఈ తరహా అవకాశాలే వచ్చాయి. ఇక వెంకటేష్ తో వెంకీ మామ, విష్ణుతో జిన్నా వంటి సినిమాలు చేసినా ఆమె ఫేట్ మారలేదు. ఇక తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే సినిమాను చేసింది. ఈ సినిమాతో మరో బంపర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ కు ప్రశంసలు కూడా వచ్చాయి.
ఇక ఇదిలా ఉంటే తాజాగా తన గుండె బద్దలైందంటూ ఓ పోస్ట్ పెట్టింది ఈ భామ. పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. తనకు సంబంధించిన విషయాలను, ఫోటోలను, వీడియోలను పంచుకుంటుంది ఈ భామ. ఇక తాజాగా పాయల్ రాజ్ పుత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. పాయల్ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఓ కుక్కపిల్ల మరణించింది.
దీంతో ఈ బ్యూటీ పూర్తిగా ఎమోషనల్ అయిపోయి... పోస్ట్ చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పెట్ డాగ్ తో ఉన్న ఫొటోలను, వీడియోలను షేర్ చేసింది. అందులో క్షమించు క్యాండీ... ఈ అమ్మ నిన్ను కాపాడుకోలేకపోయిందంటూ ఆవేదన చెందింది. నాకు ఎంతో బాధగా ఉంది... నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ బాధను వ్యక్తపరిచింది. నీ హగ్స్, నీ ప్రేమను మిస్ అవుతాను. ఇకపై నా జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను అంటూ రాసుకువచ్చింది. ఇక పాయల్ పెట్టిన పోస్ట్‌తో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
పాయల్ రాజ్ పుత్ కు దైర్యాన్ని ఇస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ వీడియోలో పాయల్ పెట్ క్యాండీ ఎంతో ముద్దుగా ఉంది. దాని మరణంపై నెటిజన్స్ కొంత మంది పాయల్ కు సపోర్టుగా నిలువగా.. మరికొంత మంది పెట్ చనిపోతే కూడా ఇలా పెట్టాలా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పాయల్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











