హాస్పిటల్ ముందే కరోనాతో హీరోయిన్ సోదరుడు మృతి.. ఎంత వేడుకున్నా దక్కని ఫలితం

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు రాక్షసరూపం దాల్చుతోంది. గ్యాప్ లేకుండా రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక పాజిటివ్ కేసులైతే లెక్కలేదు. లక్షలు దాటుతున్నాయి. ఈ క్రమంలో పేద, ధనిక అనే సంబంధం లేకుండా అన్ని వర్గాల వారిని కరోనా దెబ్బ కొడుతోంది. రీసెంట్ గా ఒక హీరోయిన్ సోదరుడి మరణం అందరిని షాక్ కు గురి చేసింది. ఆమె ఉదయం నుంచి హాస్పిటల్ ముందే ఎవరైనా సహాయం చేయాలని కోరినా ఫలితం దక్కలేదు. సోషల్ మీడియా ద్వారా కూడా సహాయం కోరింది గాని సరైన సమాధానం రాలేదు.

దేశ చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా

దేశ చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా

ఆక్సిజన్ విలువ ఏమిటో జనాలకు ఇప్పుడు అర్ధమవుతోంది. కరోనా కాటుకు ఊపిరి ఎంత ముఖ్యమయ్యిందో తెలుస్తోంది. దేశ చరిత్రలోనే ఎన్నడు లేని విదంగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో తీవ్రంగా విఫలమైందని నేషనల్ మీడియాలో కూడా అనేక రకాల విమర్శలు వెలువడుతున్నాయి.

హౌజ్ ఫుల్ బోర్డులు..

హౌజ్ ఫుల్ బోర్డులు..

దేశంలో కోవిడ్ కేంద్రాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. అంతే కాకుండా స్మశాన వాటికలు కూడా మొదటిసారి హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనమివ్వడం కలచి వేస్తోంది. బెంగుళూరులోని ఒక స్మశాన వాటిక గేటుకు హౌజ్ ఫుల్ బోర్డ్ వేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

హీరోయిన్ సోదరుడు మృతి

హీరోయిన్ సోదరుడు మృతి

ఇక ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఒక హీరోయిన్ సోదరుడిని కాపాడుకోవాడనికి తన శక్తి మేరకు ప్రయత్నాలు చేసింది. కానీ ఫలితం దక్కలేదు. నిన్ను కలిశాక - బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ - దళం వంటి తెలుగు సినిమాల్లో నటించిన నార్త్ హీరోయిన్ పియా బాజ్‌పాయ్‌ సోదరుడు ఇటీవల కోవిడ్ పాజిటివ్ రావడంతో కన్నుమూశాడు. మంగళవారం ఉదయం పరిస్థితి విషమంగా మారడంతో హాస్పిటల్ కు తీసుకువెళ్లారు.

Recommended Video

#DecadeOfVedam : Allu Arjun & Vedam Team Cherishes Memories
ఎంత వేడుకున్నా.. దక్కని ఫలితం

ఎంత వేడుకున్నా.. దక్కని ఫలితం

అయితే అప్పటికే బెడ్‌, వెంటిలేటర్‌ దొరకలేదు. ఆమె ఉదయం 6గంటల నుంచి సోషల్ మీడియా ద్వారా ఎవరైనా వెంటిలేటర్ సహాయం చేయాలని తన సోదరుడు కోన ఊపిరితో ఉన్నాడని ఎంతగానో అభ్యర్ధించింది. ఒక వ్యక్తి స్పందించినప్పటికి సరైన సమాధానం రాలేదు. అలాగే వారు ఉన్న బ్లాక్‌ వివరాలను కూడా ఆమె పోస్ట్ చేసింది. ఎవరు సహాయం చేయకపోవడంతో తన సోదరుడు చనిపోయాడు అంటూ నటి పియా బాజ్‌పాయ్‌ మరో ట్వీట్ చేయడం నెటిజన్లను కలచివేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X