Pooja Hegde హ్యాట్రిక్ డిజాస్టర్లతో బుట్టబొమ్మ బేజారు.. ఒకే నెలలో మూడు షాక్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గడంతో నేటి తరం హీరోయిన్స్ వారిని డామినేట్ చేస్తున్నారు అనే చెప్పాలి. ముఖ్యంగా పూజా హెగ్డే అయితే వరుస అవకాశాలతో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మాస్ యాక్షన్ లవ్ ఇలా అన్ని రకాల సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే ఈ బ్యూటీ రీసెంట్ గా హ్యాట్రిక్ డిజాస్టర్స్ అందుకోవడంతో ఒక్కసారిగా ఆమె క్రేజ్ తగ్గిపోయింది అనే టాక్ అయితే వస్తుంది. ఇక ఆ సినిమాల వివరాల్లోకి వెళితే..

బిగ్గెస్ట్ హిట్స్

బిగ్గెస్ట్ హిట్స్

ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం అల వైకుంఠపురములో సినిమాలు ఆమె రేంజ్ ను ఒక్కసారిగా పెంచేశాయి. ఆమె ప్రతి సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఇప్పటి వరకు ఆమె రెండు సినిమాలు చేసి హిట్ కొట్టాడు. మరొక సినిమా చేసేందుకు కూడా సిద్ధమయ్యాడు.

హ్యాట్రిక్ డిజాస్టర్స్

హ్యాట్రిక్ డిజాస్టర్స్

అయితే ఇప్పుడు పూజా హెగ్డే మాత్రం గతంలో మాదిరిగా సక్సెస్ లు అందుకోవడం లేదు. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రస్తుతం డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. కేవలం ఒక నెల వ్యవధిలోనే ఆమె వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్లు ఎదుర్కోవడం హాట్ టాపిక్ గా మారింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే కు వరుసగా మూడు సినిమాలు ఒక్కసారిగా బ్రేక్ వేశాయి అనే చెప్పాలి.

వందకోట్ల నష్టం

వందకోట్ల నష్టం

రెబల్ స్టార్ ప్రభాస్ తో నటించిన రాధే శ్యామ్ సినిమా ఊహించిన చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ సినిమా కనీసం థియేట్రికల్ బిజినెస్ లో సగం కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. దాదాపు ఆ సినిమా 100 కోట్ల వరకు నష్టాన్ని కలిగించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక విధంగా పూజా హెగ్డే పాత్రపై కూడా తీవ్ర స్థాయిలో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.

బీస్ట్ దెబ్బ..

బీస్ట్ దెబ్బ..

ఇక రాధే శ్యామ్ సినిమా తర్వాత పూజా హెగ్డే ఎన్నో ఆశలు పెట్టుకున్న బీస్ట్ సినిమా కూడా తేడా కొట్టేసింది. తమిళ స్టార్ హీరో విజయ్ తో నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ తెలుగులో రెండు చోట్ల ఒకేసారి సక్సెస్ సాధించవచ్చునని పూజా హెగ్డే నమ్మకం పెట్టుకోగా బీస్ట్ సినిమా మరి దారుణమైన ఫలితాన్ని అందుకుంది.

ఆచార్య కూడా..

ఆచార్య కూడా..

ఇక మెగా మల్టీస్టారర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా మొదటి రోజు మొదటి షోకే సినిమా రిజల్ట్ తేలిపోయింది. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఏమాత్రం లేదు అని బిలో యావరేజ్ అనే కామెంట్స్ వచ్చాయి. ఫైనల్ గా సినిమా అయితే ప్లాప్ అని టాక్ రావడంతో పూజ వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది.

 మళ్ళీ అతనితోనే..

మళ్ళీ అతనితోనే..

ప్రస్తుతం పూజా హెగ్డే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కబోతున్న కొత్త సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అల వైకుంఠపురములో సినిమాతో త్రివిక్రమ్ భారీ సక్సెస్ ఇవ్వడంతో కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. మరి ఈసారి మళ్లీ అదే దర్శకుడితో సినిమా చేస్తోంది కాబట్టి ఏదైనా మ్యాజిక్ క్రియేట్ అవుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X