Pooja Hegde అల్లు అర్హతో వీడియో వైరల్.. బుట్టబొమ్మ స్టెప్పులకు నెటిజన్ల ఫిదా
టాలీవుడ్‌లో రికార్డు కలెక్షన్లతో ఇండస్ట్రీగా మారిన అలా వైకుంఠపురంలో చిత్రం రెండేళ్లు పూర్తి చేసుకొన్నది. తెలుగు సినిమా ప్రపంచంలో అన్ని వర్గాలను ఆకట్టుకొన్న ఈ చిత్రం 200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడమే కాకుండా అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్టామినాను నిరూపించింది. ఈ చిత్రంలోని పాటలు, డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకొంటున్నారు.
అల వైకుంఠపురంలో చిత్రం రెండేళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో ఈ సినిమా హ్యాష్ ట్యాగ్, పూజా హెగ్డే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా నిలిచింది. ఈ సినిమా ఘన విజయాన్ని గుర్తు చేసుకొంటూ అభిమానులు పండుగ చేసుకొంటున్నారు. ఇలాంటి ఆహ్లాదకర వాతావరణంలో పూజా హెగ్డే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతున్నది. అల్లు అర్జున్ కుమార్తెతో కలిసి చేసిన వీడియోను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇలాంటి సమయంలో పూజా హెగ్డే తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. అలా వైకుంఠపురంలో చిత్రం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నది. అల్లు అర్జున్, నేను చేసిన డ్యాన్స్ తెర మీద మీరు చూశారు. కానీ తెర వెనుక అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హతో నేను చేసిన డ్యాన్స్ మీరు చూడండి. ఈ డ్యాన్స్ పాటకు ముందు షాట్ గ్యాప్‌లో అర్హతో నేను చేశాను. మనకు తెలియకుండానే ఈ పాటతో మనం బుట్టబొమ్మకు దగ్గరై ఉంటాం అని పూజా హెగ్డే పోస్టు చేసింది.
పూజా హెగ్డే షేర్ చేసిన వీడియోలో.. అలా వైకుంఠపురంలో చిత్రంలోని రాములో రాములా పాటకు పూజా హెగ్డే, అల్లు అర్హ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. మేకప్ రూమ్‌లో మేకప్ చేసుకొంటూనే పాటకు స్టెప్పులు వేశారు. పాటకు లయబద్దంగా స్టెప్పులు వేస్తూ ఇద్దరు కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
అల వైకుంఠపురంలో సినిమా విషయానికి వస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 12, 2020లో విడుదలైంది. వంద కోట్ల బడ్జెట్ రూపొందిన ఈ చిత్రం 262 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన పాటలు ప్రపంచవ్యాప్తంగా భాషాబేధం లేకుండా సంగీత ప్రియులను ఆకట్టుకొన్నాయి.


Click it and Unblock the Notifications











