కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్న పూజా హెగ్డే తొలి సంపాదన రూ.300.. ఎలా అంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటున్న పూజా హెగ్డే పాన్ ఇండియా ఆఫర్స్ తో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా అమ్మడికి ఎదో ఒక విధంగా హెల్ప్ అవుతోంది. కెరీర్ మొదట్లో భారీగా డిజాస్టర్స్ ఎదురైనప్పటికి కూడా ఆ తరువాత మెల్ల మెల్లగా హిట్స్ అందుకుంటూ టాప్ స్థానానికి చేరుకుంది. ఇక ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్ లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటోంది. అలాంటిది పూజా హెగ్డే తొలి సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆమె మొదటి సంపాదన ఎంతో తెలుసుకోవాలని ఉందా?

సీనియర్ హీరోయిన్స్ కు పోటీగా

సీనియర్ హీరోయిన్స్ కు పోటీగా

సీనియర్ హీరోయిన్స్ పోటీగా ఉన్నప్పటికీ కూడా పూజా హెగ్డే తన గ్లామర్ తో తన హోదాను పెంచుకుంటూ వచ్చింది. అలాగే పోటీగా నేటితరం హీరోయిన్స్ వచ్చినా కూడా అమ్మడి హోదా ఏ మాత్రం తగ్గలేదు. మెల్లగా తన సక్సెస్ రేటును పెంచుకుంటూ వెళుతున్న పూజా పాన్ ఇండియా సినిమాల్లో కూడా చాలా వేగంగా అవకాశాలు అందుకుంటోంది.

ఆ సినిమా నుంచి

ఆ సినిమా నుంచి

పూజా హెగ్డే ఇటీవల కాలంలో ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా దువ్వడా జగన్నాథమ్ సినిమాతో ఆమె స్థాయి ఒక్కసారిగా పెరుగుతోంది అని చెప్పవచ్చు. ఆ సినిమాలో బికినీ వేసి తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. వీలైనంత వరకు గ్లామర్ డోస్ ఎక్కువగా ఉండే పాత్రలను సెలెక్ట్ చేసుకుంటే అమ్మడు తన క్రేజ్ ను పెంచుకుంటోంది.

నెంబర్ వన్ హీరోయిన్..

నెంబర్ వన్ హీరోయిన్..

ఇక పూజా హెగ్డే ఇటీవల కాలంలో రెమ్యునరేషన్ డోస్ కూడా అమాంతంగా పెంచేసింది. అల.. వైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బుట్టబొమ్మ ఆ సినిమాతో ఒక్కసారిగా నెంబర్ స్థానానికి చేరుకుంది. అంతే కాకుండా అప్పటివరకు కోటి కి అటు ఇటుగా ఉన్న ఆమె పారితోషికం ఒక్కసారిగా కోటిన్నర దాటింది. ఇక ప్రస్తుతం రెండు కోట్లు డిమాండ్ చేస్తిన్నట్లు కొత్త టాక్ వినిపిస్తోంది.

మొదటి సంపాదన ఎంతంటే?

మొదటి సంపాదన ఎంతంటే?

ఇక కోట్లల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న పూజా హెగ్డే మొదటి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. చిన్నప్పుడు పూజా కాలియోగ్రఫీ నేర్చుకుందట. అనంతరం తాత సహకారంతో ఓ క్రీడా సంస్థ కోసం సర్టిఫికెట్లు రాయించేవారట. ఇక ఆ రూట్లో అమ్మడు మొదట 300 రూపాయలు అందుకుందట. అదే ఆమె తొలి సంపాదన. టీనేజర్‌గా పూజా హెగ్డే మోడలింగ్‌ చేసి మొదట్లో 5 వేల రూపాయల చెక్‌ అందుకుందట.

 చేతినిండా పెద్ద సినిమాలే..

చేతినిండా పెద్ద సినిమాలే..

ఇక ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. ఇటీవల వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో పాటు ఆచార్య సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక కోలీవుడ్ లో విజయ్ బీస్ట్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X