Pooja Hegde Remuneration: విజయ్‌తో పూజా హెగ్డే మూడోసారి.. బుట్ట బొమ్మ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
Pooja Hegde Remuneration: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) ఇటీవల 'ది గోట్' సినిమాపై భారీ అంచనాలతో ముందుకు వచ్చారు.భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. అంతముందుకు లియో సినిమా కూడా అంతగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేయలేకపోయింది. ఇక విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టే ముందు చివరి సినిమా పై భారీ అంచనాలు నెలకొనడం గమనార్హం. ప్రస్తుతం ఆయన 69వ సినిమా మొదలు పెట్టేశారు. ఇందులో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే నటించబోతున్నారని అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకోబోతుందనే చర్చ ప్రారంభమైంది.
తలపతి విజయ్ తన 69వ సినిమాతో తన సినిమా కేరీర్ కు ముగింపు పలుకబోతున్న విషయం తెలిసిందే. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఇటీవల రాజకీయ పార్టీ పెట్టాడు విజయ్. ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. అందుకే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తన 69 మూవీతో భారీ హిట్ కొట్టి, తన చివరి మూవీతో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. ఈ మూవీలో విజయ్ జోడీగా హీరోయిన్ పూజాహెగ్డే పేరు ఖరారైంది. ఈ విషయాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ అఫిసియల్ గా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ హౌస్ ఈ బుట్టబొమ్మకు స్వాగతం పలుకుతూ.. ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది.

ఇక విజయ్ చివరి సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు బాబీడియోల్ నటించబోతున్నారు. ఈ సినిమానే విజయ్ కెరీర్‌లో ఆఖరి సినిమాగా చెబుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో విజయ్ టార్చ్ పట్టుకుని మనం గమనించవచ్చు. రిసెంట్ అప్డేట్ ప్రకరం.. ఈనెల 5 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ పొలిటికల్ థ్రిలర్ల మూవీకి యంగ్ అండ్ టాలెంట్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అనిరుద్ సంగీతంలో గతంలో విజయ్ సినిమాలు ఎన్నో హిట్టయ్యాయి., అందువల్ల ఈ సినిమా మ్యూజిక్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా ప్రారంభం కాకముందుకే ఆడియో రైట్స్ కోసం పలు సంస్థలు పోీ పడుతున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 5న షూటింగ్ ప్రారంభం కానున్నఈ సినిమాను భారీగా ఓపెనింగ్ సాంగ్‌తో మొదలు పెట్టాలని ప్లాన్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించబోతున్నారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‍గా వెలుగొందిన బుట్టబొమ్మ పూజా హెగ్డే..ఆ ఫేమ్ తో రెండేళ్లుగా బాలీవుడ్‍పై కన్నేసింది. గతేడాది సల్మాన్ ఖాన్‍తో కిసి కా భాయ్.. కిసీ కి జాన్ మూవీతో నటించింది. ఆ తరువాత షాహిద్ కపూర్ హీరోగా నటించిన దేవ చిత్రంలోనూ ఈ అమ్మడు హీరోయిన్‍గా నటించారు. వాస్తవానికి ఈ అమ్మడుకు బాలీవుడ్ అంతగా కలిసి రావడం లేదనీ తిరిగి సౌత్ ఇండస్ట్రీల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో సూర్య మూవీలో నటించింది. ప్రస్తుతం తలపతి విజయ్ తన 69వ సినిమాలో నటించబోతుంది.

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ఇటీవల సూర్య 44 మూవీ కోసం రూ 3.5 కోట్ల రెమ్యూనరేషన్‍ను తీసుకున్నట్లు అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక విజయ్ దళపతి చివరి సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అంతకు ముందు 'బీస్ట్' సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే. విజయ్ చివరి సినిమాలో నటించడానికి దాదాపు రూ. 3 కోట్ల రూపాయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











